»   » ‘టెంపర్’ గురించి రాజమౌళి ఏమన్నాడు?

‘టెంపర్’ గురించి రాజమౌళి ఏమన్నాడు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్లో ఏ సినిమా విడుదలైనా..... ఆ సినిమాపై దర్శకుడు రాజమౌళి అభిప్రాయం ఎలా ఉందనే విషయం తెలుసుకోవడానికి ఎదురు చూసే వాళ్లు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే టాలీవుడ్లో అపజయం అంటూ ఎరుగకుండా సక్సెస్ ఫుల్ డైరెక్టరుగా దూసుకెలుతున్న రాజమౌళికి ఆ సినిమా నచ్చిందంటే సినిమా బావుంటుందని మైండ్ లో ఫిక్సయిపోయి థియేటర్లకు వెలుతుంటారు.

తాజాగా ‘టెంపర్' మూవీపై రాజమౌళి అభిప్రాయం కోసం ఎదురు చూసే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఇతర సినిమాలన్నీ రాజమళి తప్పకుండా చూస్తారో? లేదో? తెలియదు కానీ ఎన్టీఆర్ సినిమాలు మాత్రం రాజమౌళి తప్పకుండా చూస్తారు. ఇద్దరూ ఒకే సినిమాతో ఒకేసారి కెరీర్ మొదలు పెట్టారు.

Rajamouli positive comments on Temper movie

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
తాజాగా రాజ‌మౌళి కూకట్ పల్లిలోని మ‌ల్లిఖార్జున థియేట‌ర్‌లో టెంప‌ర్ ఫ్యాన్స్ కోసం వేసిన షోకు హాజరయ్యారు. ఆయనతోపాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ షోకు హాజరయ్యారు. ఎన్టీఆర్ న‌ట‌న హై రేంజ్‌లో ఉంద‌ని, ముఖ్యంగా కోర్టు సీన్‌, పోలీస్ స్టేష‌న్ సీన్ చాలా కాలం గుర్తుండి పోతుంద‌ని, డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న ట్రేడ్ మార్క్ హీరో క్యారెక్ట‌రైజేష‌న డైలాగ్స్‌తోనే కాకుండా స్ట్రాంగ్ స్క్రిప్ట్‌, బ్యూటిఫుల్ క్ల‌యిమాక్స్ ఇచ్చాడ‌ని రాజమౌళి చెప్పుకొచ్చారు.

మరో వైపు ఈ సినిమా విడుదలైన అన్నిచోట్లా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. ఎన్టీఆర్, కాజల్, ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
Director SS Rajamouli watched Junior NTR's "Temper" at a special benefit show to be held in Mallikarjuna theatre. Rajamouli says ‘Tarak takes his acting abilities a notch higher and excels. police station scene and especially the court scene will be remembered for long’.
Please Wait while comments are loading...