»   » బాహుబలి డబ్బుతో.... ఖరీదైన కారు కొన్న రాజమౌళి! (ఫోటోస్)

బాహుబలి డబ్బుతో.... ఖరీదైన కారు కొన్న రాజమౌళి! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రెండు పార్టులుగా విడుదలైన 'బాహుబలి' మూవీ భారీ లాభాలు తెచ్చిన పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు కోసం ఐదేళ్లు కష్టపడిన రాజమౌళి అందుకు తగిన ప్రతిఫలమే దక్కించుకున్నాడు.

బాహుబలి సినమాకు రాజమౌళి రెమ్యూనరేషన్ రూపంలో కాకుండా లాభాల్లో వాటా తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఎంత తీసుకున్న విషయం మాత్రం రాజమౌళి వెల్లడించలేదు. అయితే రాజమౌళికి ఇప్పటి వరకు ఇండియాలో ఏ దర్శకుడు తీసుకోనంత భారీ మొత్తంలో డబ్బు ముట్టిందనేది వాస్తవం.

కొత్త కారు కొన్న రాజమౌళి

కొత్త కారు కొన్న రాజమౌళి

బాహుబలి సినిమా ద్వారా వచ్చిన డబ్బుతో రాజమౌళి తాజాగా కొత్తగా బిఎండబ్ల్యూ 7 సిరీస్ కారును కొనుగోలు చేశారు. ఈ కారు విలువ రూ. 1 కోటి పైనే ఉంటుందని అంచనా.

రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు

రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు

బాహుబలి ద్వారా వచ్చిన డబ్బును రాజమౌళి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టినట్లు కూడా ఆ మధ్య వార్తలొచ్చాయి. 100 ఎకరాల్లో విశాలమైన ఫాంహౌస్ కొనుగోలు చేసినట్లు భారీగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

రాజమౌళి అక్కడ భూములు కొన్నాడా?

రాజమౌళి అక్కడ భూములు కొన్నాడా?

తెలంగాణ ప్రాంతమైన దోనకొండ సమీపంలో 150 కిలోమీటర్ల దూరంలో 100 ఎకరాల భూమి రాజమౌళి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కట్టంగూర్ మండల కేంద్రం పరిసరాల్లో ఈ భూమి ఉందని టాక్.

ఆహ్లాదకరమైన ప్రాంతం

ఆహ్లాదకరమైన ప్రాంతం


రాజమౌళి కొన్న 100 ఎకరాలు ఒకే చోట ఉందని, ఇందులో మామిడి తోటలు, సపోట తోటలు ఉన్నట్లు సమాచారం. ఎన్ హెచ్ 9 రహదారికి చేరువలో ఈ భూములు ఉన్నాయి. షూటింగులు లేని సమయంలో ఇక్కడ గడిపేందుకు రాజమౌళి ప్లాన్ చేసుకుంటున్నారు.

అభిరుచికి తగిన విధంగా ఫాంహౌస్

అభిరుచికి తగిన విధంగా ఫాంహౌస్

రాజమౌళికి అత్యంత ఆప్తుడు, ఇష్టుడు అయిన ఆర్ట్ డైరక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో ఈ 100 ఎకరాల భూమిలో భారీ భవంతి కట్టబోతున్నారని.... ఖాళీ సమయాల్లో ఇక్కడికి వెళ్లి కథలు రాసుకోవడానికి, రిలాక్స్‌గా గడపటానికి వీలుగా ఈ ఫాంహౌస్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సినిమాల్లో పెట్టడం లేదు

సినిమాల్లో పెట్టడం లేదు

సాధారణంగా చాలా మంది నటీనటులు, డైరెక్టర్లు సినిమా రంగంలో బాగా డబ్బులు సంపాదించిన తర్వాత నిర్మాతగా మారి సినిమాలు తీయడం లాంటివి చేస్తుంటారు. అయితే రాజమౌళి మాత్రం అలాంటి ఆలోచన చేయడం లేదు.

English summary
'Baahubali' director SS Rajamouli has now purchased a luxury four-wheeler, a posh BMW 7 Series car precisely. It will have cost him around Rs 1 crore.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu