»   » ఆశ్చర్యంగొలిపే 'బాహుబలి' తాజా సమాచారం (ఫోటోలు)

ఆశ్చర్యంగొలిపే 'బాహుబలి' తాజా సమాచారం (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: ఇక ఇప్పుడందరి చూపూ 'బాహుబలి'పైనే. 'ఛత్రపతి' తర్వాత ప్రభాస్‌తో ఎస్‌.ఎస్‌.రాజమౌళి తీస్తున్న సినిమా ఇది. ఈ సినిమా గురించి వినిపిస్తున్న వూహాగానాలు అన్నీ ఇన్నీ కావు. కొబ్బరికాయ కొట్టకముందే బోలెడన్ని కబుర్లు వినిపించాయి. సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇంతకీ ఆ సినిమాలో ఏముంది? ఎప్పుడొస్తుంది? అసలు ఇప్పుడేం జరుగుతోంది? ఇంతకీ ఎలా ఉంటుంది ఆ సినిమా? ప్రభాస్‌ ఎలా కనిపిస్తాడు? ఎంత డబ్బుతో తీస్తున్నారు? ఇలా ఒకటేమిటి? ఒకరేమిటి? ఇతర చిత్ర పరిశ్రమలు కూడా మన 'బాహుబలి' గురించి ఆరాతీస్తున్నాయి. ఈ సినిమా గురించి ఎంత గోప్యంగా ఉంచుతూంటే అంత ఆసక్తి రేపుతోంది.

  మరో ప్రక్క 'బాహుబలి' సినిమా కోసమే అన్నట్టుగా ప్రభాస్‌ కూడా ఓ వార్మప్‌ మ్యాచ్‌ ఆడాడు. అదే... 'మిర్చి'. ఇందులో ఆయన కత్తి పట్టి ప్రతినాయకులతో చెడుగుడు ఆడాడు. సూటూబూటూ ధరించి అమ్మాయిల మనసులతోనూ ఆడుకొన్నాడు. మ్యాచ్‌కి ముందు వార్మప్‌ అని ఒకటుంటుంది. సమరానికి సన్నద్ధమవ్వడంలాంటిదన్నమాట. అందులో ఆటగాళ్ల జోరుని చూసి తదుపరి మ్యాచ్‌ ఫలితంపై ఓ అంచనాకి వస్తుంటాం అలాగే బాహుబలిపై మిర్చి మరింత అంచనాలు పెంచేసింది. జక్కన్న శిల్పం... బాహుబలి కోసం అందరూ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

  ఈ నేపధ్యంలో 'బాహుబలి' గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు స్లైడ్ షో లో...

  కత్తియుద్ధాలు

  కత్తియుద్ధాలు

  ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్న ప్రభాస్‌, రానా, అడవి శేష్‌ తదితరులు కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీలు నేర్చుకొని సెట్‌లోకి అడుగుపెట్టారు. పాత్రలకు తగ్గట్టుగా గుబురు గడ్డం కూడా పెంచారు.

  రెండు పాత్రల్లో ప్రభాస్‌?

  రెండు పాత్రల్లో ప్రభాస్‌?

  ఇందులో ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. తెరపై రానా వృద్ధుడిగా కనిపిస్తారని, ఆయనకి తనయుడిగా అడవిశేష్‌ కనిపిస్తారని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే సినిమాకి సంబంధించిన ఒక్క అంశాన్ని కూడా బయటకు పొక్కకుండా రాజమౌళి జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ప్రభాస్‌ ఈ సినిమాకోసం ప్రత్యేకంగా ఆహారపు నియమాలు పాటిస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా జిమ్ లో ట్రైనర్స్ సహాయంతో కండలు పెంచారు. ఈ చిత్రంలో ప్రబాస్ ని చూసి షాక్ అవుతారంటున్నారు.

  రమ్యకృష్ణ పాత్ర

  రమ్యకృష్ణ పాత్ర

  ‘బాహుబలి' లో రమ్యకృష్ణ కూడా నటిస్తోంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ ప్రభాస్, రానాల తల్లిగా నటించనుంది. గతంలో ‘అమ్మోరు' సినిమాలో అమ్మేరు పాత్రలో నటించి అందరిని మెప్పించిన తను రాజసం ఉట్టిపడే ఈ పాత్రకి సరైన న్యాయం చేస్తుందని అందరూ బావిస్తున్నారు. ఈమె పాత్ర నెగిటివ్ టచ్ తో సాగుతుందని సమాచారం.

  పార్ట్‌ 2 ఉందా?

  పార్ట్‌ 2 ఉందా?

  'బాహుబలి'ని రెండు భాగాలుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. కథరీత్యా నిడివి కాస్త పెరుగుతుందని తెలియడంతో సినిమాని రెండు భాగాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోందని సమాచారం.

  బడ్జెట్ ఎంత

  బడ్జెట్ ఎంత


  సుమారు రూ: 150కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. రామోజీ ఫిల్మ్‌సిటీలో భారీ సెట్స్‌ని తీర్చిదిద్ది చిత్రీకరణని జరుపుతున్నారు. ఈ సెట్స్ కే చాలా ఖర్చు అయ్యిందని చెప్తున్నారు. ఇక ఆర్టిస్టులకు ట్రైనింగ్ లు, రెమ్యునేషన్స్ కలిపితే చాలా అవుతుందని భావిస్తున్నారు.

  రామోజీ ప్రశంస

  రామోజీ ప్రశంస

  కళాదర్శకుడు సాబుసిరిల్‌ ఆధ్వర్యంలో రామోజీ ఫిల్మ్‌సిటీలో భారీస్థాయి సెట్స్‌ తీర్చిదిద్దారు. ఆ సెట్స్‌ని ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ప్రత్యక్షంగా పరిశీలించారు. దర్శకుడు రాజమౌళిని, సాబుసిరిల్‌ని అభినందిస్తూ ఓ లేఖ రాశారు. వంద అవార్డులు వచ్చినంత ఆనందంగా ఉందంటూ ఆ లేఖని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు రాజమౌళి.

  నాలుగు భాషల్లో...

  నాలుగు భాషల్లో...

  తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఫ్రెంచ్‌, జపనీస్‌, స్పానిష్‌, కొరియన్‌ భాషల్లోకి అనువదించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలకు పంపించే ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం.

  ఐ మేక్స్‌

  ఐ మేక్స్‌

  ఐమాక్స్‌ ఫార్మాట్‌లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. యారీ ఎలెక్సా ఎక్స్‌.టి. కెమెరాని వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు కేరళ, తమిళనాడు, రాజస్థాన్‌లలో చిత్రీకరణ జరుగుతుంది.

  సత్యరాజ్...

  సత్యరాజ్...

  'బాహుబలి' లో 'కబ్బా' అనే పాత్రలో సత్యరాజ్‌ నటిస్తున్నారని సమాచారం. ఈ పాత్ర కోసం గుర్రపుస్వారీ, కత్తిపోరాటాలపై శిక్షణ తీసుకుంటున్నారని తమిళ సిని వర్గాల సమాచారం. ఈ పాత్ర కోసం ఆయన గుండు గీయించుకున్నారు. గతంలో ఆయన గుండు గీయించుకుని చేసిన చిత్రాలు సూపర్ హిట్టయ్యాయి. . '100వదు నాల్‌'లో విలన్ గా తనదైన నటన ప్రదర్శించి కోలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత 'జల్లికట్టు', 'అమైదిపడై', 'మారన్‌'వంటి పలు సినిమాలు చేశారు. వీటి కోసం ఆయన గుండు గీయించుకుని నటించడం విశేషం.

  సుదీప్

  సుదీప్

  'బాహుబలి' లో గెస్ట్ రోల్ లో ఓ కథలో ఓ కీలకమైన మార్పుని తెచ్చే పాత్రను సుదీప్ పోషిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై చాలా ఎక్సైట్ మెంట్ తో సుదీప్ ఉన్నారు. ఈ విషయమై సుదీప్ మీడియాతో మాట్లాడుతూ... నేను బాహుబలి చిత్రంలో ఆయుధాల వ్యాపారిగా కనిపిస్తాను. నా పాత్ర పేరు అస్లం ఖాన్. అంతేగాక ఈ చిత్రంలో నాకు సత్యరాజ్ కు మధ్య కత్తి పైట్ సీన్ ఉందని అన్నారు. అలాగే సుదీప్ ట్వీట్ చేస్తూ..." బాహుబలి షూటింగ్ ఖచ్చితంగా ఓ మంచి ఎక్సపీరియన్స్ , చాలా అద్బుతమైన సెట్స్, మంచి టీమ్ , రాజమౌళి గారితో మళ్లీ పనిచేయటం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలతో ట్వీట్ చేస్తాను ." అన్నారు.

  బ్లూ మ్యాట్ లో చిత్రీకరణ

  బ్లూ మ్యాట్ లో చిత్రీకరణ

  ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన ప్రత్యేక సెట్స్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడే సెవెంటీ పర్శంట్ వరకూ షూట్ జరగనున్నట్లు సమచారం. అందులోనూ గ్రాఫిక్స్ ప్రధాన పాత్ర వహిస్తాయని, బ్లూ మ్యాట్ వర్కు బాగా ఉంటుందని తెలుస్తోంది.

  English summary
  We all know he is currently busy shooting his magnum opus Baahubali at huge sets erected at Ramoji Film City in Hyderabad. The latest confirmation from the team we came to know is that the talented director has now decided to make this high budgeted movie in two parts.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more