»   » ‘బాహుబలి’ మెగా సక్సెస్ కంటే గొప్ప.... రాజమౌళి గురించి రోబో ‘2.0’ నిర్మాత

‘బాహుబలి’ మెగా సక్సెస్ కంటే గొప్ప.... రాజమౌళి గురించి రోబో ‘2.0’ నిర్మాత

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్‌తో రోబో '2.0' సినిమాను తెరకెక్కిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌ అధినేతల్లో ఒకరైన రాజు మహాలింగం బాహుబలి డైరెక్టర్ రాజమౌళిని కలిశారు. జక్కన్నను కలిసిన అనంతరం ఆయన ట్విట్టర్లో ఆసక్తికర కామెంట్స్ చేశారు.

'రాజమౌళిని కలిసిన తర్వాత ఆయన ఎంతో వినయం, వినమ్రత కలిగిన వ్యక్తి అని అర్థమైంది. ఆయన హ్యుమిలిటీ బాహుబలి మెగా సక్సెస్ కంటే కూడా గొప్పది. రెస్పెక్ట్ సర్' అంటూ రాజు మహాలింగం ట్వీట్ చేశారు.


ఎందుకు కలిసినట్లు?

రాజమౌళి, రాజు మహాలింగం మీటింగ్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇద్దరి కాంబినేషన్లో భవిష్యత్తులో భారీ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీకి చెందిన వారు చర్చించుకుంటున్నారు.


రోబో 2.0

రోబో 2.0

రాజమౌళి గురించిన ట్వీట్ కంటే ముందు ఆయన రోబో 2.0 చిత్ర విశేషాలు చెప్పుకొచ్చారు. ఈ చిత్రం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2018లో సినిమాను భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు తేబోతున్నట్లు తెలిపారు.


400 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టాం

400 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టాం

రోబో 2.0 సినిమా కోసం రూ. 400 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టాం. ఈ సినిమాను 3డి ఫార్మాట్లో కూడా షూట్ చేశాం. ఇండియాలో కేవలం 1500 3డి స్క్రీన్లు మాత్రమే ఉన్నాయి. మరిన్ని ఎక్కువ 3డి స్క్రీన్ల కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు.


గొప్ప విజయం అందుకుంటుంది

గొప్ప విజయం అందుకుంటుంది

రోబో 2.0 గొప్ప విజయం అందుకుంటుందనే నమ్మకం ఉంది. హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. రజనీకాంత్, అక్షయ్ కుమార్ పెర్ఫార్మెన్స్, శంకర్ డైరెక్షన్, గ్రాఫిక్స్ సినిమాకు హైలెట్ అవుతాయని తెలిపారు.English summary
Raju Mahalingam of Lyca Productions, the makers of superstar Rajinikanth's upcoming Tamil science-fiction action film 2.o, finds the humility of filmmaker S.S Rajamouli much bigger than the success of Baahubali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu