twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ తో చేసే చిత్రం గురించి రాజమౌళి

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన తదుపరి చిత్రం హిందీ-తెలుగు బాషల్లో బైలింగ్వువల్ గా చేస్తానని అన్నారు. ఈగ హిందీ డబ్బింగ్ మక్కీ ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. అలాగే ఈ చిత్రం ఓ పీరియడ్ చిత్రం అని,చారిత్రికం మాత్రం కాదని తేల్చి చెప్పారు. ఇక అది ఓ జానపదం(ప్లోక్ స్టోరీ) అన్నారు. అంతేకాక సినిమా పునర్జన్మ మీద కాదనన్నారు. మగధీర,ఈగ వంటి కాన్సెప్టు కాదని తెలియచేసారు.

    బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ప్రాంక్ గా చెప్పాలంటే నాకు బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ ..ఏమీ ఈగ విడుదల అయ్యేదాకా రాలేదు. ఇప్పుడు వరసగా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ సౌత్ లో కొన్ని ఇప్పటికే ఒప్పుకున్న కమిట్ మెంట్స్ ఉన్నాయి. అవి పూర్తయ్యాకే బాలీవుడ్ ప్రయాణం అన్నారు. అఫ్ కోర్స్ ఓ స్టోరీ టెల్లర్ గా నా సినిమా ఎక్కువ మంది ఆడియన్స్ ని రీచ్ అవ్వాలనే కోరుకుంటాను అన్నారు.

    'అందాల రాక్షసి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాటి ఈ చిత్రంలో చాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందాల రాక్షసి చిత్రంలో ఆమె పెర్ఫార్మెన్స్ నచ్చి రాజమౌళి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్ ఈచిత్రంలో మెయిన్ హీరోయిన్ గా చేయనుందని సమాచారం. సోసియో ఫాంటసీ నేపథ్యంలో ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త గెటప్ తో కనిపించనున్నాడు. ఈచిత్రాన్ని ఆర్కా మీడియా పతాకంపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఈ సినిమా ఉంటుంది.

    ఇక భారీ బడ్టెట్ తో రూపొందనున్న ఈ చిత్రానికి సంభందించి ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ శివార్లలో సుమార్ ఇరవై ఐదు ఎకరాల స్ధలంలో ఓ భారీ సెట్ ని వేస్తున్నారు. అలాగే ఈ చిత్రం కోసం పది డజన్ల గుర్రాలు బుక్ చేసారని సమాచారం. ఇటీవల ప్రభాస్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ముందు రాజమౌళితో సినిమా, ఆ తర్వాతే పెళ్లి అని స్పష్టం చేసాడు. డిసెంబర్ నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని, ఈచిత్రం తనకెంతో ప్రతిష్టాత్మకమని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

    English summary
    Rajamouli plans to make a bilingual (Hindi-Telugu) period film and it will not be a historical. Looks like the maverick director had enough of reincarnation as his next film has a folk story backdrop. His Vikramarkudu and Maryada Ramanna have already been remade in Bollywood as Rowdy Rathore and Son of Sardaar respectively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X