»   » అయ్యా నన్ను ఒగ్గేయండయ్యా.... అంటూ రాజమౌళి రిక్వెస్ట్!

అయ్యా నన్ను ఒగ్గేయండయ్యా.... అంటూ రాజమౌళి రిక్వెస్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మరో నాలుగు రోజుల్లో 'బాహుబలి-2' రిలీజ్ ఉన్న నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి సినిమా రిలీజ్ కు సంబంధించిన టెన్షన్ లోనే ఉన్నారు. సినిమా ప్రమోషన్స్, ఇంటర్వ్యూలు ఇలా తీరిక లేకుండా గడుపుతున్నాడు.

సినిమా గురించి తన పాట్లేదో తాను పడుతుంటే.... వర్మ తన గురించి ట్విట్టర్లో పోస్టు చేయడంతో రాజమౌళి కంగారు పడిపోయాడు. 'అయ్యా... నన్ను ఒగ్గేయండయ్యా' అంటూ రాజమౌళి వర్మను రిక్వెస్ట్ చేసాడు.

ఇంతకీ వర్మ చేసిన ట్వీట్ ఏమిటి?

ఇంతకీ వర్మ చేసిన ట్వీట్ ఏమిటి?

రాజమౌళి, తాను కలసి ఉన్న ఓ ఫొటోను వర్మ తన ట్విట్టర్లో పోస్టు చేయడంతో పాటు.... 'బ్యూటీ అండ్ అగ్లీ' అనే క్యాప్షన్ పెట్టాడు. తాను అగ్లీగా ఉన్నానని, రాజమౌళి మాత్రం అందంగా ఉన్నాడని మరో ట్వీట్ పెట్టాడు.

బాహుబలి2 కంటే సెక్సీగా

బాహుబలి2 కంటే సెక్సీగా

బాహుబలి2 కంటే కూడా రాజమౌళి చాలా సెక్సీగా ఉన్నాడంటూ వర్మ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అయింది. వీరి మధ్యలో బాలీవుడ్ క్రిటిక్ కమాల్ రషీద్ ఖాన్ ఎంటరై ఈ ట్వీట్లను మరింత హిటెక్కించే ప్రయత్నం చేసాడు.

ఇద్దరూ అగ్లీగాన ఉన్నారు అంటూ

ఇద్దరూ అగ్లీగాన ఉన్నారు అంటూ

మీరిద్దరూ గొప్ప దర్శకులు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మీ ఇద్దరూ అగ్లీగానే ఉన్నారంటూ ట్వీట్ చేశాడు కమాల్ రషీద్ ఖాన్. దీనికి వర్మ స్పందిస్తూ... అందరూ మీలాగా, షారుక్ ఖాన్ లాగా హాండ్సమ్ గా ఉండరు కదా అంటూ సెటైర్ వేసాడు వర్మ.

తేడా కొడుతుందని భావించిన రాజమౌళి

తేడా కొడుతుందని భావించిన రాజమౌళి

వీరిద్దరి ట్విట్లతో తన కొంపముంచే విధంగా ఉన్నారని భావించిన రాజమౌళి వెంటనే ట్విట్టర్ ద్వారా స్పందించారు. అయ్యా నన్ను ఒగ్గేయండయ్యా అంటూ వేడుకున్నాడు.

English summary
Director Ram Gopal Varma compared Rajamouli with his next movie Baahubali: The Conclusion saying that Rajamouli looks more sexier than his movie by sharing a picture of him with Rajamouli. Leaving everyone in surprise, Rajamouli replied saying “Ayyaaa…nannu oggeyyandayyaa”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu