»   » దర్శుకుడు రాజమౌళి కొడుకు తాగి డ్రైవ్ చేస్తూ పోలీకులకు దొరికిన వేళ...

దర్శుకుడు రాజమౌళి కొడుకు తాగి డ్రైవ్ చేస్తూ పోలీకులకు దొరికిన వేళ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చాలా స్ట్రిక్ట్ గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల్లో పలు సందర్భాల్లో సినీ తారలు దొరికిపోయిన సందర్భాలు అనేకం.

ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు రాజమౌళి కుమారుడు.... కార్తికేయ కూడా ఇలా ఓసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయాడట. ఈ విషయాన్ని ఇటీవల షోటైమ్ ఆడియో వేడుకలో కార్తికేయ స్వయంగా వెల్లడించారు.

Karthikeya

ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ కు వెళ్లారా అని యాంకర్ సుమ అడగ్గా.... ఓ సారి తాగి డ్రైవ్ చేస్తుంటే పోలీసులు పట్టుకున్నారని, అపుడు ఇది తప్పని తనకు తెలియదని కార్తికేయ వెల్లడించారు. అన్నట్లు షోటైమ్ సినిమాలో కార్తికేయ ఓ పాట కూడా పాడారు. మొత్తానికి రాజమౌళి కుమారుడు కూడా కళాకారుడే అన్నమాట.

నిజమే: హీరో అవ్వాలకున్న రాజమౌళి: 'షో టైమ్'(టీజర్)

షో టైమ్ సినిమా విషయానికొస్తే...రాజమౌళి ఫ్యామిలీకి చెందిన వారిలో రచయిత ఎస్ఎస్ కాంచి గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ఎస్‌ఎస్ కాంచి దర్శకత్వంతో 'షో టైమ్' అనే సినిమా వస్తోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజైంది.

రణ్‌ధీర్, రుక్సార్ కీలక పాత్రల్లో కనపడనున్న ఈ సినిమాను రమా రీల్స్ పతాకంపై సుధీర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సునీల్ నటించిన 'మర్యాద రామన్న', సుమంత్ హీరోగా వచ్చిన 'ఏమో గుర్రం ఎగరా వచ్చు' సినిమాలకు కథ, మాటలు అందించిన కాంచి మెగాఫోన్ పట్టాలని ఎన్నాళ్ళ నుండో ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్ళకి 'షో టైమ్'తో ఆయన యత్నాలు ఫలించాయి. ఈ సినిమాకు రాజమౌళి ఫ్యామిలీలో పెద్దన్న కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

English summary
When asked about whether he has been to police station before, Rajamouli's Son Karthikeya gave some shocking reply. He admitted that he was caught by police for drinking and driving.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu