»   » రూటు మార్చిన రాజమౌళి కొడుకు, ఈ కొత్త యవ్వారం ఏంటో?

రూటు మార్చిన రాజమౌళి కొడుకు, ఈ కొత్త యవ్వారం ఏంటో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి తనయుడు కార్తికేయ దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తన తండ్రి సినిమాలకు సంబంధించిన టీంలో తనూ ఉంటూ... సినిమాలకు సంబందించిన కీలక వ్యహారాలు, పబ్లిసిటీ కాన్సెప్టులను ఇంతకాలం ఎంతో అద్భుతంగా డీల్ చేస్తూ వచ్చారు కార్తికేయ.

డాక్టర్ కొడుకు డాక్టర్ అయినట్లే...యాక్టర్ కొడుకు యాక్టర్ అయినట్లే... డైరెక్టర్ కొడుకు డైరెక్టర్ అవుతున్నాడంటూ ప్రచారం జరిగింది. ఆ మధ్య కార్తికేయ కొన్ని షార్ట్ ఫిల్మ్ కూడా తీయడంతో అంతా ఇదే విధంగా ఆలోచించారు. అయితే కార్తికేయ ఉన్నట్టుండి రూటు మార్చారు.

Rajamouli's son starts hotel business

ఎవరూ ఊహించని విధంగా కార్తికేయ హోటల్ బిజినెస్ లోకి దిగారు. కొండాపూర్ లోని వైట్ ఫీల్డ్స్ ఏరియాలో 'ది సర్క్యూట్' పేరుతో సొంత హోటల్ మొదలు పెట్టినట్లు సమాచారం. అయితే కార్తికేయ దీన్నే మెయిన్ బిజినెస్ గా కొనసాగిస్తారా? లేక ఇదో సైడ్ బిజినెస్ లాంటిదా? అనేది తెలియాల్సి ఉంది.

సినిమా రంగంలో బాగా సంపాదించిన వారు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం కొత్తేమీ కాదు. అయితే కార్తికేయ మొదట్లోనే ఇలా బిజినెస్ వైపు అడుగులు వేయడం చర్చనీయాంశం అయింది. అయితే ఇది కార్తికేయ ప్లానా? లేక తన తండ్రి రాజమౌళి ఆలోచనలను ఆచరణలోకి తెస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

English summary
Most popular director SS Rajamouli's son SS Karthikeya is supposed to turn film director, but going by the reports we have to say that he's turning up as entrepreneur.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu