twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘జింతాత తా’ రాజమౌళి వద్దన్నారట, ఎందుకంటే....

    By Bojja Kumar
    |

    Recommended Video

    Rajamouli Not Happy With Jinthaktha Tha Title

    రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'విక్రమార్కుడు' సినిమా ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాతో పాటు ఇందులో పాటలు కూడా సూపర్ హిట్. ముఖ్యంగా 'జింతాత చిత చిత జింతాతతా' పాట అయితే అప్పట్లో టాపు లేపింది. కొన్ని రోజుల తర్వాత 'జింతాత తా' పేరుతో సినిమా వస్తున్నట్లు కూడా మనకు వార్తలు వినిపించాయి. ఈ వార్తల వెనక అసలు స్టోరీ తాజాగా వెలుగులోకి వచ్చింది.

    రాజమౌళి అసిస్టెంట్ త్రికోటి

    రాజమౌళి అసిస్టెంట్ త్రికోటి

    రాజమౌళి దగ్గర అసిస్టెంటుగా పని చేసిన త్రికోటి దర్శకుడిగా మారి గతంలో `దిక్కులు చూడ‌కు రామయ్య‌` అనే చిత్రం చేశారు. ఇదే దర్శకుడు ఇపుడు ‘జువ్వ' అనే చిత్రాన్ని తెరకెక్కించారు.

     ‘జింతాత తా'టౌైటిల్ వద్దన్న రాజమౌళి

    ‘జింతాత తా'టౌైటిల్ వద్దన్న రాజమౌళి

    ‘జువ్వ' చిత్రానికి మొదట ‘జింతాత తా' అనే టైటిల్ పెడదామనుకున్నారట నిర్మాతలు. ఇదే విషయాన్ని త్రికోటి రాజమౌళి దృష్టికి తీసకెళితే వద్దని చెప్పారట. ‘జింతాతతా' అనేది ఫన్నీ వర్డ్ అని, దీన్ని టైటిల్‌గా పెడితే ప్రేక్షకులు ఇది ఎలాంటి సినిమానో అర్థంకాక కన్‌ఫ్యూజ్ అవుతారని చెప్పారట.

    సోషల్ మీడియాలో హాట్ టాపిక్

    సోషల్ మీడియాలో హాట్ టాపిక్

    ‘జువ్వ' సినిమా పోస్టర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. అందుకు కారణం ఈ సినిమా పోస్టర్లపై మెగాస్టార్ చిరంజీవి ఫోటోలు ఉండటమే. ఈ సినిమా ద్వారా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బంధువు రంజిత్ హీరోగా పరిచయం అవుతున్నాడు.

    జువ్వ

    జువ్వ

    రంజిత్, పాల‌క్ ల‌ల్వానీ హీరో, హీరోయిన్ల‌గా న‌టిస్తోన్న చిత్రం `జువ్వ‌`. `దిక్కులు చూడ‌కు రామయ్య‌` ఫేం త్రికోటి పేట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎస్. వి. ర‌మ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో సొమ్మి ఫిలింస్ పై డా. భ‌ర‌త్ సోమి నిర్మిస్తున్నారు. ఎమ్. ఎమ్. కీర‌వాణి సంగీతం స‌మ‌కూర్చారు. ఈ సినిమా ఫిబ్రవరి 23న విడుదలవుతోంది.

    నటీనటులు, టెక్నీషియన్స్

    నటీనటులు, టెక్నీషియన్స్

    ఇందులో పోసాని కృష్ణ ముర‌ళి, అలీ, స‌ప్త‌గిరి, ముర‌ళీ శ‌ర్మ‌, ర‌ఘుబాబు, ప్ర‌భాక‌ర్, విజయ్ చంద‌ర్, ఆనంద్, ఐనాక్స్ వెంక‌ట్, పింగ్ పాంగ్ సూర్య‌, జ‌బ‌ర్ధ‌స్త్ శ్రీను, షేకింగ్ షేషు, సారిక రామ‌చంద్ర‌రావు, ఏడిద శ్రీరాం, మోహ‌న్ రావు, హిమ‌జా, మునిరాజు, ల‌త‌, తుల‌సి, ప్ర‌స‌న్న కుమార్, ప్ర‌భాష్ శ్రీను, రాజేష్‌, భ‌ద్ర‌మ్, సురేఖా వాణి, స‌నా, దువ్వాసి మోహ‌న్ , ప్ర‌జ్వాల్, ఆయుష్, ఎస్తార్ అనీల్, విష్ణు ప్రియ‌, ప‌ద్మ‌జా, ఫ‌రీద్, క‌బీర్, అజ‌ర్, నాగు త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి క‌థ, మాట‌లు: ఎమ్. ర‌త్నం, సాహిత్యం: అనంత శ్రీరాం, వ‌శిష్టి, కొరియోగ్ర‌ఫీ: గ‌ణేష్, జానీ, ఎడిటింగ్: కోట‌గిరి వెంకటేశ్వ‌ర‌రావు, త‌మ్మిరాజు, యాక్ష‌న్: వెంక‌ట్, నందు, ఆర్ట్: రామ్ అర‌స‌విల్లి, సినిమాటోగ్ర‌ఫీ: సురేష్‌, సంగీతం: ఎమ్.ఎమ్. కీర‌వాణి, నిర్మాత : డా. భ‌ర‌త్ సోమి, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: త‌్రికోటి పేట‌.

    English summary
    The movie is Juvva which is currently a hot topic in social media. Though the expectations are less on it, the makers are confident that it will become a hit. Initially, the title Juvva was not finalized. But we all know how big of a hit, jinthaktha tha song from Rajamouli's Vikramarkudu became. So, the makers thought of keeping Jinthaktha tha as the title. Rajamouli stated that it is a funny word and the audience might get confused with such title.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X