»   » నేను సిగ్గుగా ఫీలవుతున్నా, రమ్యకృష్ణ నన్ను క్షమించు.., రాజమౌళి

నేను సిగ్గుగా ఫీలవుతున్నా, రమ్యకృష్ణ నన్ను క్షమించు.., రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర ఎంతటి పేరొందిందో ఇప్పటికే అర్థమైంది. ఆ పాత్రలో రమ్యకృష్ణ అభినయం అద్భుతంగా ఆకట్టుకుంది. అయితే ఆ పాత్ర కోసం ముందుగా రాజమౌళి... అతిలోక సుందరి శ్రీదేవిని సంప్రదించారట.ఈ పాత్ర కోసం మొదట రమ్యకృష్ణను అనుకోలేదట. శ్రీదేవితో పాటు మరికొందరు బాలీవుడ్‌ నటీమణులలో ఎవరో ఒకరి చేత ఈ రోల్‌ వేయిద్దామనుకున్నాడు రాజమౌళి. బాహుబలి 2 తమిళ్ ఆడియో విడుదల సందర్భంగా అదే విశయం చెప్తూ రమ్య కృష్ణకి సారీ చెప్పటం అందరినీ ఆకట్టుకుంది...

రమ్యకృష్ణ నటన చూసిన తర్వాత

రమ్యకృష్ణ నటన చూసిన తర్వాత

కానీ శ్రీదేవి ఈ పాత్ర కోసం రూ. 6 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో చివరకు రమ్యకృష్ణను శివగామిగా ఖరారు చేశారు. ఇక రమ్యకృష్ణ నటన చూసిన తర్వాత... శ్రీదేవి ఆ పాత్ర చేసి ఉంటే ఈ రేంజీలో నటించేది కాదేమోనంటూ ఇప్పటికే పలువురు అభిప్రాయ పడుతున్నారు.

 శ్రీదేవినే

శ్రీదేవినే

శివగామి పాత్రలో రమ్యకృష్ణకు ఎంత పేరొచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ పాత్ర కోసం శ్రీదేవినే ముందు సంప్రదించినట్టు రాజమౌళి చెప్పుకొచ్చారు. మరి ఆ స్థానంలోకి రమ్యకృష్ణ ఎందుకు వచ్చిందన్న కారణం ఇప్పుడు తెలిసొచ్చింది. శ్రీదేవి భారీగా రెమ్యునరేషన్‌ అడగడంతో వెనకడుగు వేయటం మంచిదే అయ్యిందని రాజమౌళి కూడా తర్వాత అనుకున్నాడట.

తప్పు అంగీకరించాడు

తప్పు అంగీకరించాడు

ఈ విషయంలో తన తప్పు అంగీకరించాడు రాజమౌళి. చెన్నైలో జరిగిన ఆడియో విడుదల కార్యక్రమంలో మాట్లాడిన రాజమౌళి.. ‘‘శివగామి' పాత్ర కోసం మొదట వేరేవారిని అనుకున్నా. రమ్యకృష్ణగారు అందుబాటులో ఉన్నా.. వేరే వారి కోసం ప్రయత్నించా. అందుకు సిగ్గుపడుతున్నా. ఈ విషయంలో ఆమెకు సభాముఖంగా క్షమాపణ చెబుతున్నా. ఆవిడ అద్భుత నటనతో శివగామి పాత్రను పండించార'ని ప్రశంసించాడు.

కుర్ర హీరో విజయ్ తో

కుర్ర హీరో విజయ్ తో

అతిలోక సుందరి తమిళం లో కుర్ర హీరో విజయ్ తో నిర్మించిన సినిమా ‘పులి' కోసం వెంటనే చాలా రోజులు డేట్లిచ్చి ఎంతో ఇష్టంగా సినిమా పూర్తి చేసింది. దీనికిగానూ కొట్లలో రెమ్యునరేషన్ తీస్కుందట. ఐతే పాపం ఆ సినిమాలో ముందు చిత్రీకరించిన దానికంటే శ్రీదేవి పాత్రనిచాలా తగ్గించేసారు. రెమ్యునరేషన్ విషయం లోనూ చాలా గొడవే జరిగింది.

రాణీ పాత్రలో

రాణీ పాత్రలో

భారీ సోషియో ఫ్యాంటసీ చిత్రం లో రాణీ పాత్రలో ఉండే పాత్ర సినిమాకి హైలెట్ అని చెప్పారట కానీ తీరా డబ్బింగ్ సమయంలో ఫైనల్ వెర్షన్ చూస్తే శ్రీదేవికి దిమ్మదిరిగి పోయినట్లు సమాచారం. దర్శకుడు చింబుదేవన్ కథ చెప్పేటపుడు శ్రీదేవి పాత్ర గురించి చాలా చెప్పాడట.

పాత్రను బాగా కుదించేసారు

పాత్రను బాగా కుదించేసారు

అలా చెప్పినట్లే శ్రీదేవి మీద చాలా సన్నివేశాలు కూడా చిత్రీకరించారు.కానీ తీరా డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళిన శ్రీదేవి కి తన పాత్ర చాలా తగ్గిపోయిందని అర్థమై. అదే విషయం దర్షకున్ని అడిగితే. లెంగ్త్ ఎక్కువై పోతుండటంతో ఎడిటింగ్‌లో భాగంగా శ్రీదేవి నటించిన చాలా సన్నివేశాలకు కట్ చేసి పాత్రను బాగా కుదించేసినట్లు తెలిసింది.

చాలానే భాద పడిందట

చాలానే భాద పడిందట

దీంతో శ్రీదేవి కి పిచ్చి కోపం వచ్చి ఈ విషయంలో దర్శకుడితో ఆమె గొడవ కూడా పడిందట. ఐతే లెంగ్త్ సమస్య గురించి చెప్పి కన్విన్స్ చేసిన చింబు దేవన్ ఎలా గోలా శ్రీదేవి తోనే డబ్బింగ్ చెప్పించారు. పాపం తీరా సినిమా బయటికివచ్చాక అట్తర్ ఫ్లాప్... అప్పటి వరకూ ఉన్న పేరు కూడా కొట్తుకుపోయేట్టున్న పాత్ర చేసినందుకు చాలానే భాద పడిందట శ్రీదేవి మేడమ్...

English summary
Rajamauli Talking about Ramya Krishna, he said, "I'm sorry and I feel ashamed now as to why I've considered all those other options without approaching Ramya Krishna first. Without her, there is no Sivagami". Flattered by these praises, Ramya felt so overwhelmed and excited.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu