»   » రాజమౌళి తనయుడి దర్శకత్వం

రాజమౌళి తనయుడి దర్శకత్వం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇండస్ట్రీలో ఇప్పుడు "వారసుల" ట్రెండ్ నడుస్తోంది... ఇప్పటి వరకు వారసులు హీరోలుగా మాత్రమే ఎంట్రీ ఇస్తున్న సమయం లో... తాజాగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తికేయ మాత్రం తన తండ్రి బాటలోనే నడవబోతున్నారు. టాలీవుడ్‌లో హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు తమ వారసులను తెరపై చూపించడానికి ఆసక్తిగా ఉంటారు. కానీ రాజమౌళి మాత్రం తన తనయుడిని తెర మీద హీరోగా కాకుండా హీరో మేకర్ అయిన డైరెక్టర్ గా చూడాలనే మొదటినుంచీ అనుకున్నారట.

అయితే ఎప్పుడూ కార్తికేయని "నువ్వు ఇదే కావాలీ"... అంటూ ఫోర్స్ చేయకుండానే తన పూర్తి ఇష్టం తోనే డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు కార్తికేయ.. ఇప్పటికే రాజమౌళి సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేస్తూ అనుభవాన్ని గడిస్తున్నాడు. భాహుబలి సమయం లో తండ్రితో బాటే తానూ పనిచేస్తూ దర్శకత్వ పాఠాలు నేర్చుకోవటం మొదలు పెట్టాడు.

షోయింగ్ బిజినెస్ పేరుతో కార్తికేయ ఓ కంపెనీని ఏర్పాటు చేశాడు అన్న విషయమై ఇప్పటికీ వార్తలువచ్చాయి. సినిమాలకు సంబంధించి పబ్లిసిటీ కంటెంట్ ని క్రియేటివిటీతో అందించడానికి కార్తికేయ కంపెనీ ఆ సినిమా దర్శక నిర్మాతలకు సలహాలు అందిస్తూ ఉంటుంది. "మనం" "ఊహలు గుసగుసలాడే" "ఒక లైలా కోసం" "బాహుబలి" తదితర చిత్రాలకి సంబంధించిన మేకింగ్ వీడియోస్ లోనూ పోస్టర్ల డిజైనింగ్ లోనూ కార్తికేయ సంస్థ తన సలహాలు అందివ్వడమే కాకుండా ఆ సినిమాల పోస్టర్లకు విడుదలకు ముందే క్రేజ్ ఎర్పడేలా కార్తికేయ షోయింగ్ బిజినెస్ సంస్థ పనిచేస్తోంది.

Rajamouli Son Kartikeya Entry in Film Industry

ఆ మధ్య బాహుబలి ప్రమోషన్ సమయంలో కూడా తన తనయుడి గురించి చాలా గొప్పగా పొగిడారు రాజమౌళి..బాహుబలి చిత్రానికి తన తనయుడు ఎంతో శ్రమించాడని అన్ని పనులు తనపై వేసుకొని చివరికి తాను తిట్టినా కూడా సంతోషంగా భరించాడని తన కొడుకు ఎక్కువగా చెప్పడం భావ్యంకాదని చెప్పడం లేదని అన్నారు.

ప్రస్తుతం రాజమౌళి తనయుడు కార్తికేయ ఇప్పటికే తండ్రి సినిమాలకు అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. బాహుబలి2 సినిమాలో కూడా కార్తికేయ తండ్రి దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు.బాహుబలి-2 పూర్తి కాగానే తనే దర్శకుడిగా సొంతంగా ఓ సినిమా తీసి దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు కార్తికేయ.

ఇప్పటికే కొన్ని సినిమాల ట్రైలర్స్ లను క్రియేటివ్ గా కటింగ్ చేయించి, అలాగే కొత్త రీతిలో వాటిని ప్రోమోట్ చేయించి తన టాలెంట్ ఏంటో చూపించాడు. దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు కార్తికేయ. అందుకు సంబంధించిన కథను కూడా రెడీ చేసుకున్నాడట. మరి మెగాఫోన్ చేత పట్టి కార్తికేయ తన తండ్రి పేరు నిలబెడతాడో లేదో చూడాలంటే బాహుబలి పూర్తయ్యి కార్తికేయ సొంత సినిమా మొదలుపెట్టేదాకా వెయిట్ చేయాల్సిందే...

English summary
S.S. Karthikeya is already at work to carve himself a place in Tollywood
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu