»   » రాజమౌళి సినిమాలకు... కీరవాణి రిటైర్మెంట్ తర్వాత అతడేనా?

రాజమౌళి సినిమాలకు... కీరవాణి రిటైర్మెంట్ తర్వాత అతడేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియాలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎంఎం. కీరవాణి ఒకరు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా సంగీత ప్రియులను అలరిస్తున్న ఆయన రిటైర్మెంటుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు గతేడాది తన అఫీషియల్ సోషల్ నెట్వర్కింగ్ పేజీ ద్వారా రిటైర్మెంట్ డేట్ ప్రకటించారు. డిసెంబర్ 8, 2016న తాను సినిమాల నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు స్పష్టం చేసారు.

కీరవాణి తన ట్విట్టర్ పేజీలో ఈ విషయమై ప్రస్తావిస్తూ...'నా కెరీర్లో ఫస్ట్ సాంగ్ డిసెంబర్ 9, 1989లో చెన్నైలోని ప్రసాద్ స్టూడియోలో రికార్డు చేసాను. డిసెంబర్ 8, 2016వ తేదీన రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను. నా క్లోజ్ అసోసియేట్స్, మ్యూజీషియన్స్‌తో కలిసి హైదరాబాద్‌లోని ప్రసాద్ స్టూడియోలో రిటైర్మెంట్స్ సెలబ్రేషన్స్ జరుపుకోవాలనుకుంటున్నాను. అని కీరవాణి పేర్కొన్నారు.

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా 1987లో కెరీర్ ప్రారంభించిన కీరవాణి....1990లో వచ్చిన 'మనసు మమత' చిత్రం ద్వారా సొంతగా మ్యూజిక్ కంపోజింగ్ మొదలు పెట్టారు. రెండున్నర దశాబ్దాల తన కెరీర్లో ఇప్పటి వరకు 200లకు పైగా చిత్రాలకు సంగీతం అందించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మళయాలం, హిందీ చిత్రాలకు కూడా ఆయన సంగీతం అందించారు.

Rajamouli to opt for Devisri or kalyani Malik

కీరవాణి సోదరుడు రాజమౌళి.....తెలుగులో తిరుగులేని దర్శకుడిగా, అపజయం తెలియని దర్శకుడిగా ఎదిగాడు. ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలన్నింటికీ ఆయనే సంగీతం అందించారు. తాజాగా విడుదలైన ‘బాహుబలి' సినిమాకు కూడా కీరవాణి సంగీతం అందించారు.

బాహుబలి పార్ట్ 2కు సంగీతం అందించిన తరువాత కీరవాణి రిటైర్ కాబోతున్నారు. మరి కీరవాణి తర్వాత రాజమౌళి సినిమాలకు ఎవరు సంగీతం అందిస్తారనే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కీరవాణి సోదరుడు కళ్యాణి మాలిక్ ఆ స్థానంలోకి వస్తాడని అంటున్నారు. కీరవాణి రేంజ్ లో కాకపోయినా... పలు సినిమాలకు వినసొంపైన సంగీతం అందించిన కళ్యాణి మాలిక్‌లో ఎంతో టాలెంట్ ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అన్నా రాజమౌళికి ఇష్టమే. అతనికి కూడా తన సినిమాల్లో అవకాశం ఇవ్వొచ్చని అంటున్నారు.

English summary
Rajamouli to opt for Devisri or kalyani Malik after Keeravani retirement
Please Wait while comments are loading...