twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మూవీ బాగుందని రాజమౌళి ట్వీట్, ఇక వారికి పండగే!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా సినిమాలు తీసే దర్శకుడిగా, ఓటమి అంటూ ఎరుగని హిట్ చిత్రాల దర్శకుడిగా రాజమౌళి పేరుంది. మరి అలాంటి దర్శకుడు ఏదైనా సినిమా చూసి బాగుందని కాంప్లిమెంట్స్ ఇస్తే.....ప్రేక్షకుల్లోనూ ఆ సినిమాపై ఆసక్తి కలుగడం మామూలే. గతంలో రాజమౌళి ప్రశంసలు అందుకున్న సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్టయ్యాయి. మంచి వసూళ్లు సాధించాయి.

    తాజాగా 'అంతకు ముందు ఆ తరువాత' అనే సినిమాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు రాజమౌళి. 'చాలా తక్కువ అంచనాలతో అంతకు ముందు ఆ తర్వాత సినిమాకు వెళ్లాను. కానీ బాగా ఎంజాయ్ చేసాను. నటీనటులంతా బాగా పెర్ఫార్మెన్స్ చేసారు...ముఖ్యంగా రావు రమేష్, రోహిణి, అవసరాల శ్రీనివాస్ మరియు నా గుడ్ ఫ్రెండ్ వెంకట్. కొత్త అమ్మాయి ఇషా ఆకట్టుకుంది. సుమంత్ అశ్విన్ పరిణతితో నటించాడు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' అని ట్వీట్ చేసారు.

    <blockquote class="twitter-tweet blockquote"><p>good friend Venkat. New girl esha is impressive. Sumanth Ashwin handled matured scenes well. All the best to the whole team.</p>— rajamouli ss (@ssrajamouli) <a href="https://twitter.com/ssrajamouli/statuses/372249007537410048">August 27, 2013</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

    <blockquote class="twitter-tweet blockquote"><p>Went to AMAT with low expectations, but enjoyed it. Very good performances from everyone esp Rao Ramesh, rohini,avasarala sreenivas and my</p>— rajamouli ss (@ssrajamouli) <a href="https://twitter.com/ssrajamouli/statuses/372247912505286657">August 27, 2013</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

    ఇప్పటి వరకు అంతంత మాత్రంగానే ఉన్న 'అంతకు ముందు ఆ తరువాత' కలెక్షన్స్ రాజమౌళి ట్వీట్ తరువాత పెరుగుతాయని ఆశిస్తున్నారు. ఎందుకంటే రాజమౌళికి ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఫాలోవర్స్ లక్షల్లో ఉన్నారు. అందు వల్ల ఆయన ట్వీట్ మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నారు.

    రంజిత్ మూవీస్ నిర్మించిన 'అంతకు ముందు.. ఆ తరువాత...' చిత్రంలో సుమంత్ అశ్విన్, ఈషా నాయకా నాయికలు. రోహిణి, మధుబాల, ప్రగతి, రవిబాబు, రావు రమేష్, ఉప్పలపాటి నారాయణరావు, అవసరాల శ్రీనివాస్, తాగుబోతు రమేష్, ఝాన్సీ, సుదీప, మాధవి, స్నిగ్ధ, పమ్మి సాయి, సొహైల్, అర్చన, అపర్ణ వర్మ ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, అనంత్ శ్రీరామ్, నృత్యాలు: నోబుల్, సుచిత్ర, పాపి, కళ: ఎస్.రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: కల్యాణి కోడూరి, సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్ మోహన్ రెడ్డి, నిర్మాత: కె.ఎల్.దామోదరప్రసాద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

    English summary
    “Went to Anthaku Mundu Aaa Tharvatha with low expectations, but enjoyed it. Very good performances from everyone esp Rao Ramesh, Rohini,Avasarala Sreenivas and my good friend Venkat. New girl esha is impressive. Sumanth Ashwin handled matured scenes well. All the best to the whole team”, director SS Rajamouli tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X