»   » ‘అత్తారింటికి దారేది’పై రాజమౌళి కామెంట్

‘అత్తారింటికి దారేది’పై రాజమౌళి కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓ వైపు సినిమాల విడుదలకు ఇబ్బందికర పరిస్థితి, మరో వైపు పైరీసీ....ఇలా ఎన్నో ఆటుపోట్లను అధిగమించిన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద సక్సెస్ అయింది.

ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ చిత్రంపై స్పందించారు. 'సినీ పరిశ్రమ కష్టసమయంలో ఉన్నపుడు అత్తారింటికి దారేది చిత్రం విడుదలై ఇతర చిత్రాలకు దారి చూపింది. ఇది పరిశ్రమకు పెద్ద ఉపశమనం లాంటిది. పవర్ స్టార్, త్రివిక్రమ్ మరోసారి తమ స్టామినా చూపెట్టారు' ట్వీట్ చేసారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.

నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్: రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
"More than anything else, AD paved the way for the release of films in these difficult times. This is a big relief for the entire industry" Rajamouli tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu