»   » రాజమౌళి చూసి సూపర్ అన్నాడుగా!...ఇక ఆ సినిమా హిట్టే!

రాజమౌళి చూసి సూపర్ అన్నాడుగా!...ఇక ఆ సినిమా హిట్టే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అపజయం ఎరుగని దర్శకుడిగా, ప్రేక్షకుల నాడి బాగా తెలిసిన దర్శకుడిగా రాజమౌళికి తెలుగు సినిమా పరిశ్రమలో మంచి పేరుంది. మరి అలాంటి దర్శకుడు ఏదైనా సినిమా చూసి బాగుందని చెబితే......ఆ సినిమా చూడాలని సాధారణ ప్రేక్షుకుల్లో ఆసక్తి పెరగడం సహజమే. గతంలో రాజమౌళి బావుందని కితాబిచ్చిన సినిమాలు హిట్టయ్యాయి.

తాజాగా రాజమౌళి ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన 'చందమామ కథలు' చిత్రం చూసారు. 'సినిమా కొంచె స్లోగా ఉంది కానీ...నటీనటుల పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు, క్లైమాక్ష్ చాలా బాగుంది' అంటూ తన ట్విట్టర్లో తెలపారు. రాజమౌళి బాగుందని కితాబిచ్చాడంటే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని, సినిమా హిట్టవుతుందని పరిశ్రమ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Rajamouli tweet about Chandamama Kathalu

మంచు లక్ష్మి, సీనియర్ నరేష్, ఆమణి, కృష్ణుడు, నాగ శౌర్య, అభిజిత్, షామిలి, అమితారావు, రిచా పనయ్, చైతన్య కృష్ణ, పృథ్వి, వెన్నెల కిషోర్, కొండవలస, దువ్వాసి మోహన్ తదితరులు నటిస్తున్న చిత్రం 'చందమా కథలు'. ఈ చిత్రం నిన్న విడుదలైంది. బాక్సాఫీసు వద్ద ఈచిత్రం యావరేజ్ టాక్‌తో రన్ అవుతోంది.

'ఎల్బీడబ్ల్యూ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమై 'రొటీన్‌ లవ్‌స్టోరీ' చిత్రంతో కమర్షియల్‌ సక్సెస్‌ను అందుకున్న ప్రవీణ్‌ సత్తారు తాజాగా తెరకెక్కిస్తున్న మూడవ చిత్రం 'చందమామ కథలు'. ఎ వర్కింగ్‌ డ్రీమ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై చాణక్య బూనేటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:మిక్కీ జె మేయర్‌, ఎడిటింగ్‌:ధర్మేంద్ర కాకర్ల.

English summary
“Saw Chandamama Kathalu. It is bit slower at times but top notch performances make it worthwhile. Very good photography, production values and climax”, wrote Rajamouli on the twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu