»   » రాజమౌళికి అవన్నీ గుర్తుకొస్తున్నాయి...

రాజమౌళికి అవన్నీ గుర్తుకొస్తున్నాయి...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rajamouli tweet about Childhood in Chennai
హైదరాబాద్: విషయం చిన్నదైనా,పెద్దదైనా తన మనస్సులో అనిపించింది స్పందిస్తూ ఎప్పుడూ ట్వీట్స్ ద్వారా తన అభిమానులకు దగ్గరగా ఉండే దర్శకుడు రాజమౌళి. రీసెంట్ గా ఆయన తన చిన్ననాటి గురుతులు ని ట్విట్టర్ ద్వారా గుర్తు చేసుకున్నారు. ఆయన 'మర్యాదరామన్న' తమిళ రీమేక్‌ 'వల్లా వణుక్కుం పుల్లుమ్‌ ఆయుధమ్‌' పాటల విడుదల వేడుక కోసం చెన్నై వెళ్లారు. దీంతో ఆయన చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి.

రాజమౌళి ట్వీట్ చేస్తూ... ''దేవి థియేటర్‌లో కూర్చుంటే చిన్న నాటి సంగతులు గుర్తుకొస్తున్నాయి. ఇక్కడ ఎన్ని సినిమాలు చూశానో. అందులో నా అభిమాన రాబిన్‌హుడ్‌ సినిమాలు కూడా ఉన్నాయి'' అంటూ ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి..బాహుబలి షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

ఇక బాహుబలి విషయానికి వస్తే ఈ చిత్రం కథ మహాభారతాన్ని పోలి ఉండబోతుందని, అన్నదమ్ముల మధ్య జరిగే అధికారం కోసం జరిగే పోరు చుట్టూ సినిమా తిరగనుంది. తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్‌ - మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.

ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకోసం ఇప్పటికే ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకుని,విశ్వరూపం ప్రదర్శశిస్తోంది.

English summary
Rajamouli tweeted.."In chennai aftr a lng time. Attendin vallavanukku pullum ayudham audio release Devi Watchd so mny eng movs der incding my fav robinhood :)"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu