»   » ‘జై లవ కుశ’ టీజర్‌పై రాజమౌళి స్పందన, జై పాత్రలో ప్రత్యేకత అదే...

‘జై లవ కుశ’ టీజర్‌పై రాజమౌళి స్పందన, జై పాత్రలో ప్రత్యేకత అదే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ నటించిన 'జై లవ కుశ' టీజర్ గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తుండగా ఈ రోజు విడుదలైన టీజర్ ద్వారా 'జై' పాత్ర ఎలా ఉండబోతోంది అనేది పరిచయం చేశారు.

ఇండియన్ సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇందులో ఓ ప్రత్యేకత ఉంది. జై పాత్రను నిశితంగా పరిశీలిస్తే..... అతడి చేతికి సంకెళ్లు వేసినట్లు గొలుసులు కనిపిస్తున్నాయి. దానికి చివర్లో ప్రమాదకరమైన గొడ్డలి ఆయుధం ఉంది.


అత్యంత క్రూరంగా

అత్యంత క్రూరంగా

దీన్ని బట్టి ‘జై' పాత్ర ఎంత క్రూరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అతడి శరీరంలో గొడ్డలి ఆయుధం కూడా ఓ భాగం అయిపోయింది. ఆయుధాన్ని తన నుండి ఎవరూ దూరం చేయడానికి వీల్లేకుండా దాన్ని తన చేతికి ఫిక్స్ చేసుకున్నాడు.


రాజమౌళి ట్వీట్

జై లవ కుశ టీజర్ విడుదలైన వెంటనే రాజమౌళి ట్వీట్ చేశాడు. టీజర్ చాలా బావుందని, సినిమా పబ్లిసిటీ కూడా డిఫరెంటుగా ఉందని రాజమౌళి ప్రశంసించారు.


జై ఫ్రమ్ జవాన్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ.... జవాన్ మూవీ టీం తరుపు ‘జై' పాత్రకు జై కొట్టారు. టీజర్ అద్భుతంగా ఉందని సాయి ధరమ్ తేజ్ తెలిపారు.


ఆల్ టైమ్ రికార్డ్

ఆల్ టైమ్ రికార్డ్

జై టీజర్ యూట్యూబ్ లో విడుదలైన 60 నిమిషాల్లో 78 వేల లైక్స్ సాధించి ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది.


టీజర్ అదుర్స్

యూట్యూబ్ లో టీజర్ అదరగొడుతోంది. రేపు ఉదయాన్నికల్లా ఈటీజర్ 1 మిలియన్ మార్క్ అందుకుంటుందని అంచనా.English summary
"Too Good, Tarak9999 ... THIS is how you start the publicity of a film...Just WOW" Rajamouli tweet about Jai Lava Kusha teaser.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu