»   » ఆల్రెడీ ‘కబాలి’ షో పడింది, ఇదిగో రివ్యూ రిపోర్ట్!

ఆల్రెడీ ‘కబాలి’ షో పడింది, ఇదిగో రివ్యూ రిపోర్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళనాడులో ని ఓ సాధారణ వ్యక్తి మలేసియా మాఫియా డాన్‌గా మారిన కథ 'కబాలి'. ఈ చిత్రం కమల్ కు నాయకుడు చిత్రంలా రజనీకు కబాలి ఉండబోతోందంటున్నారు. 'కబాలి' చిత్రీకరణ ఎక్కువ భాగం మలేసియాలోనే జరిగింది. ఇందులో విలన్‌తో పాటు కొన్ని కీలక పాత్రల్లో విదేశీ నటులు నటించారు. ఈ చిత్రం కోసం కేవలం తమిళనాడులోనే కాక మొత్తం ప్రపంచం ఎదురుచూస్తోంది.

ఈ నేపధ్యంలో ఈ చిత్రం తాను చూసానని, యూకే సెన్సార్ బోర్డ్ మెంబర్, సిని విశ్లేషకుడు సంధు కబాలి టాక్ ని రివ్యూతో సహా అందించారు. ఇక ఈ చిత్రంలో రజనీ ఔట్ స్టాండింగ్ ఫెరఫార్మెన్స్ చూపారని, ఆయన వన్ మ్యాన్ షో గా ఈ సినిమాని పేర్కొంటూ ఈ సినిమాకు ఐదుకు నాలుగు రేటింగ్ ఇచ్చారు. అలాగే ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ఈ రివ్యూను షేర్ చేసారు.గతంలో పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ , బ్రహ్మోత్సవం సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని ఇతగాడు చెప్పాడు. కానీ అతను చెప్పింది రివర్స్ అయింది. కేవలం అల్లు అర్జున్ ...సరైనోడు సినిమా విషయంలో అతడు చెప్పింది నిజమే అయింది. మరి 'కబాలి' విషయంలో ఏమవుతుందో చూడాలి.


రివ్యూలో సంధు ఇంకేం చెప్పాడు స్లైడ్ షోలో చదవండి...


బెస్ట్ పైసా వసూల్

బెస్ట్ పైసా వసూల్

ఈ సినిమా ఈ సంవత్సరంలో బెస్ట్ పైసా వసూల్ చిత్రం అవుతుందని అన్నాడు.


మిస్టేక్స్ లేకుండా

మిస్టేక్స్ లేకుండా

ఎక్కడా ఏ పొరపాటు లేకుండా రజనీకాంత్ అవుట్ స్టాండింగ్ ఫెరఫార్మె న్స్ ఇచ్చారు.


ఎ నుంచి జెడ్ దాకా

ఎ నుంచి జెడ్ దాకా

ఈ చిత్రం సీన్స్.. ఎ నుంచి జెడ్ దాకా పూర్తిగా రజనీకాంత్ ఫెరఫార్మె న్స్ ని చూపెట్టాయి.


మరో ప్రక్క

మరో ప్రక్క

ఈ సినిమాలో రజనీకు పోటీగా రాధికా ఆప్టే అద్బుతంగా చేసింది. ఆమె కెరీర్ లో ఇదే బెస్ట్ ఫెరఫార్మెన్స్ అని చెప్పవచ్చు.


డల్ మూమెంట్స్

డల్ మూమెంట్స్

సినిమాలో ఒక్క డల్ మూమెంట్ కూడా చెప్పుకోవటానికి లేదు. అంతా ఓ ప్లోలో వెళ్లిపోయింది.


ఫెంటాస్టిక్

ఫెంటాస్టిక్

దర్సకుడు పి ఎ రంజిత్ దర్శకత్వం గురించి చెప్పాలంటే ఫెంటాస్టిక్ అనాలి


అద్బుతం

అద్బుతం

మలేషియా లొకేషన్స్ ని అద్బుతంగా కళ్లకు విందు అనిపించేలా చిత్రీకరించారు


ఫస్ట్ రేట్

ఫస్ట్ రేట్

ప్రొడక్షన్ డిజైనింగ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ రేట్ అని చెప్పాలి.


హైలెట్స్

హైలెట్స్

క్రిస్ప్ ఎడిటింగ్, స్టోరి, స్క్రీన్ ప్లే ఎక్సలెంట్ గా కుదరటం , అదిరిపోయే రీతిలో యాక్షన్ సీక్వెన్స్ సినిమా కు హైలెట్స్


రజనీ ఎంట్రీ ..

రజనీ ఎంట్రీ ..

సినిమా లో రజనీ ఎంట్రీ గురించి చెప్పాలంటే సింప్లీ చిట్టీ మార్


డైలాగ్స్

డైలాగ్స్

సినిమాలో డైలాగ్స్ అన్నీ క్లాస్ గా క్లాప్స్ కొట్టించేవిగా , విలువైనవి గా ఉన్నాయి


క్లైమాక్సే

క్లైమాక్సే

సినిమాలో క్లైమాక్సే యుఎస్ పి . అదే సినిమాని నిలబెడుతుంది. అన్ని వర్గాల వారికి రికమెండ్ చేయదగ్గ చిత్రం ఇది.English summary
The first review of Superstar Rajinikanth starrer upcoming much awaited drama “Kabali” has been given by Umair Sandhu of UK Censor board member and he has given 4 stars out of five, to this gangster drama.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu