»   »  మన ఇంటి లేడీస్‌ను టచ్ చేయకూడదా?.... కూతురి ఎంట్రీపై రాజశేఖర్

మన ఇంటి లేడీస్‌ను టచ్ చేయకూడదా?.... కూతురి ఎంట్రీపై రాజశేఖర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోల వారసత్వంతో హీరోలు ఎంట్రీ ఇస్తున్నారే తప్ప.... హీరోయిన్లుగా వచ్చిన వారు చాలా రేర్ అనే చెప్పాలి. ఈ విషయంలో హీరో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి.

చాలా మంది స్టార్స్ తమ కొడుకులను హీరోలుగా రావడానికి ఒప్పుకుంటున్నారే తప్ప, తమ కూతుళ్ళను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ఇష్టపడటం లేదని..... ఈ విషయంలో ఇక్కడ చాలా హిపోక్రసీ ఉందని ఆయన అన్నారు.

మన ఇంటి లేడీస్‌ను టచ్ చేయకూడదా?

మన ఇంటి లేడీస్‌ను టచ్ చేయకూడదా?

ఇండస్ట్రీలో చాలా హిపోక్రసీ ఉంది. మనం సినిమాల్లో ఇతర హీరోయిన్లను టచ్ చేస్తాం, రొమాన్స్ చేస్తాం.... కానీ మన ఇంటి లేడీస్‌ సినిమాల్లోకి రాకూడదు. వారిని ఎవరూ టచ్ చేయకూడదు అనే ధోరణి తెలుగు ఇండస్ట్రీలో ఉంది...అని రాజశేఖర్ వ్యాఖ్యానించారు.

ఇదేం తప్పుడు పని కాదే...

ఇదేం తప్పుడు పని కాదే...

అలాంటి హిపోక్రసీ భావనతో ఉన్నారంటే.... వాళ్లు సినిమా ఇండస్ట్రీని తప్పుగా భావిస్తున్నట్లే. నేను మాత్రం అలా భావించడం లేదు. అన్ని వృత్తుల్లాగే ఆడ, మగ తేడా లేకుండా అంతా కలిసి పని చేసే ఇండస్ట్రీ సినీ ఇండస్ట్రీ అని భావిస్తున్నాను. అందుకే నా కూతురు ఇటు వైపు వస్తానంటే వెంటనే ఒప్పుకున్నాను అని రాజశేఖర్ తెలిపారు.

'Ego' Movie Hero And Heroine Speech At Movie Launch
ఆడవాళ్లు సినిమాల్లోకి వస్తే చెడిపోతారని...

ఆడవాళ్లు సినిమాల్లోకి వస్తే చెడిపోతారని...

ఆడవాళ్లు సినిమాల్లోకి వస్తే చెడిపోతారని, ఫ్యామిలీకి చెడ్డ పేరు వస్తుందనే అభిప్రాయం ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఇపుడు కొంత తగ్గింది. పూర్తిగా తగ్గలేదు. డాక్టర్ కొడుకు డాక్టర్ అయినట్లే యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వడంలో తప్పు లేదు. అలాంటపుడు హీరోల కూతుళ్లు హీరోయిన్లయితే కూడా తప్పులేదనేది నా అభిప్రాయం అని రాజశేఖర్ అన్నారు.

నా కూతురుకి ఫుల్ సపోర్ట్

నా కూతురుకి ఫుల్ సపోర్ట్

మా అమ్మాయి నటిస్తానని చెప్పగానే వెంటనే ఒప్పుకున్నాను. ఈ విషయంలో నా కూతురుకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాను. నాకు కొడుకు ఉంటే హీరోగా పరిచయం చేసేవాడిని. కూతురు ఉంది కాబట్టి హీరోయిన్ గా పరిచయం చేయాలనుకుంటున్నాను అని రాజశేఖర్ తెలిపారు.

శివాని

శివాని

జీవిత-రాజశేఖర్ పెద్ద కూతురు శివాని త్వరలో హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేయబోతోంది. అందుకు తగిన విధంగా శివానీ సిద్ధమవుతోంది. సినిమాల్లో ప్రవేశానికి ముందే అందం పరంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

English summary
"Earlier it was believed that if women come into films, then they will get spoil and bring a bad name to the family. But when a doctor's son is becoming a doctor and lawyer's son a lawyer, why not an actor's daughter an actor? If I've had a son, I would have made him a hero only. As there is no such chance, I'm making my daughter a heroine", said Rajasekhar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu