»   » టాలీవుడ్ తెరంగేట్రానికి సిద్ధ‌మ‌వుతున్న హీరో రాజ‌శేఖ‌ర్‌ కూతురు

టాలీవుడ్ తెరంగేట్రానికి సిద్ధ‌మ‌వుతున్న హీరో రాజ‌శేఖ‌ర్‌ కూతురు

Posted By:
Subscribe to Filmibeat Telugu

శివాని రాజశేఖర్, ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమ్రోగుతోంది. డా. రాజశేఖర్, జీవితల ముద్దుల తనయ అయిన తను తన అందం, అభినయంతో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో ఒక తారగా వెలగడానికి సిద్దమవుతోంది. తన తల్లితండ్రుల నట వారసత్వాన్ని అంది పుచ్చుకున్న ఈ భామ ఇటీవల చేసిన ఒక ఫోటోషూట్ చాలా మంది అగ్ర దర్శకుల దృష్టిని ఆకర్షించింది.

మన ఇంటి లేడీస్‌ను టచ్ చేయకూడదా?.... కూతురి ఎంట్రీపై రాజశేఖర్

Rajasekhar Daughter Shivani is Making Her Debut in Films

కంటెంట్, బ్రాండ్ బిల్డింగ్, ఫిలిం యాక్విజిషన్ మరియు ఇంటిగ్రేషన్, స్పోర్ట్స్, మ్యూజిక్ వంటి రంగాలలో ప్రవేశమున్న భారతదేశంలోనే అతి పెద్ద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ అయిన క్వాన్, దక్షిణ భారతదేశపు సరికొత్త సంచలనం శివానికి ప్రాతినిధ్యం వహించడం చాలా ఆనందంగా ఫీల్ అవుతోంది. ఇంతక ముందు క్వాన్ చాలా మంది హిందీ, తెలుగు, తమిళ్ అగ్ర తారలను లాంచ్ చేయడం లో కీలక పాత్ర వహించింది.

Rajasekhar Daughter Shivani is Making Her Debut in Films

కళలు, డాన్స్, మార్షల్ ఆర్ట్స్ లో మెలుకువలు నేర్చుకుంటూనే, మెడిసిన్ కూడా చదువుతోంది శివాని. రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె అయిన శివానికి ఇండస్ట్రీ లో పెద్ద స్టార్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. తన ఆకర్షణీయనమైన పర్సనాలిటీ, అందం తో అందరి దృష్టిని ఇప్పటికే ఆకర్షించిన శివాని, తన సీనియర్స్ అయిన విజయ శాంతి, నయనతార, అనుష్క, ప్రియాంక చోప్రా, దీపిక పదుకోనే లాగా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని చూస్తోంది.

English summary
Tollywood actor Rajasekhar Daughter Shivani is Making Her Debut in Films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu