For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  200 కోట్ల ఆస్తులు, అన్నీ పోయాయి, అమ్మ బాధపడింది: హీరో రాజశేఖర్ కంటతడి!

  By Bojja Kumar
  |

  డా.రాజ‌శేఖ‌ర్‌. ఈయ‌న క‌థానాయ‌కుడిగా రూపొందిన చిత్రం పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం. పూజా కుమార్‌, శ్ర‌ద్ధాదాస్‌, కిషోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. జ్యో స్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్ బ్యాన‌ర్‌పై ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్వ‌క‌త్వంలో కోటేశ్వ‌ర్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను నవంబ‌ర్ 3న విడుల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం ప్రీ రిలీజ్ వేడుక జ‌రిగింది. ఈ సందర్భంగా రాజశేకర్ ఎమోషనల్ అయ్ాయరు.

   మేఘాల్లో తేలిపోయినంత సంతోషం

  మేఘాల్లో తేలిపోయినంత సంతోషం

  నా జీవితంలో ఇలాంటి సందర్భం వచ్చింది లేదు. నా సినిమా ‘గరుడ వేగ' ట్రైలర్ 5 మిలియన్ వ్యూస్ వచ్చిందని చెప్పినపుడు మా మమ్మీ కూడా ఉన్నారు. ఆమె కూడా చాలా సంతోష పడ్డారు. నెక్ట్స్ డే చనిపోయారు. అంతకు ముందు రోజు వరకు నేను మేఘాల్లో తేలిపోయినంత సంతోషంగా ఉన్నాను. చాలా లాంగ్ టైమ్ తర్వాత ఈ సినిమాతో సక్సెస్ వస్తుందనే నమ్మకం ఏర్పడింది... అని రాజశేఖర్ అన్నారు.

  Filmibeat Top 10 ఫిల్మీ బీట్ టాప్ 10
   200 కోట్ల ఆస్తులు అమ్ముకున్నా

  200 కోట్ల ఆస్తులు అమ్ముకున్నా

  ముందు నుండీ మా అమ్మకు ఉన్న పెద్ద బాధ ఒకటే. కొడుకు చాలా లాస్ అయిపోయాడు అని. చెన్నైలో ఉన్న చాలా బిల్డింగ్స్ అమ్మేశాను. అదంతా ఉంటే దాదాపు రూ. 200 కోట్ల ఆస్తి ఉండేది. కానీ రాంగ్ టైమ్ లో రాంగ్ సినిమాలు చేయడం, నాకు సూట్ కాని సినిమాలు చేసి నష్టపోయాను. తమిళంలో సూదు కవ్వం అనే సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను. ఆ సినిమా తెలుగులో చేద్దామని చేసి ఆరేడు కోట్లు పోగొట్టుకున్నాను. ఇలా చాలా డబ్బులు పోయాయి.... అని రాజశేఖర్ అన్నారు.

   అయ్యో నా కొడుకు ఇలా అయిపోయాడే అని బాధ పడేవారు

  అయ్యో నా కొడుకు ఇలా అయిపోయాడే అని బాధ పడేవారు

  అయ్యో కొడుకు ఏంటి ఇలా అయిపోయాడు. సినిమా ఫీల్డులో చాలా మంది చనిపోయే ముందు ఇలా లాస్ అయ్యే చనిపోతారు. ఏజ్ అయ్యే సరికి ఏమీ వారి చేతిలో ఉండదు అనేది నా కొడుకు విషయంలో కూడా జరుగుతుందేమో అని మా అమ్మ బాధ పడేవారు.... అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.

   సొంతగా సినిమాలు తీయడం మానేశా

  సొంతగా సినిమాలు తీయడం మానేశా

  మా ఫాదర్ కూడా ఇకపై సొంతగా సినిమాలు చేయొద్దు బాబు అని చెప్పేవారు. ఇలా చెబుతున్నపుడు నాకే బాధ కలిగి సినిమాలు మనం చేయకూడదు. వచ్చే సినిమాలనే ఒప్పుకుని చేయాలి. అదృష్టం బావుంటే మంచి సినిమా వస్తుంది అని కూర్చున్నాను. కొందరు నా వద్దకు వచ్చి విలన్ గా చేస్తారని మీ గురించి ప్రచారం జరుగుతుంది... చేస్తారా? అంటే తప్పకుండా చేస్తాను సబ్జెక్ట్ చెప్పండి అన్నాను. అది మామూలు విలన్ పాత్ర. ఇలా 30, 40 సినిమాలు ఇలాంటి ప్రపోజల్స్ తోనే వచ్చాయి. అలాంటి సమయంలో నలుగురు సూపర్ మ్యాన్స్ నన్ను ముందుకు నడిపించారు. అందులో ఒకటి మా నాన్న, రెండోది కోటేశ్వర రాజుగారు, మూడోది ప్రవీణ్ గారు, నాలుగోది నా వైఫ్.... అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.

   అమ్మ జ్ఞాపకంతో కంటతడి పెట్టిన రాజశేఖర్

  అమ్మ జ్ఞాపకంతో కంటతడి పెట్టిన రాజశేఖర్

  ఇలాంటి సమయంలో నేను చాలా హ్యాపీగా ఉండి మా అమ్మకు, నాన్నకు నిరూపించబోతున్న సమయంలో అమ్మ మరణం రూపంలో నా జీవితంలోకి దురదృష్టం వచ్చింది. ఇలాంటి సందర్బం నా జీవితంలో వచ్చింది లేదు. నెత్తి మీద పెద్ద పిడుగు పడ్డట్లయింది. చాలా మంది అమ్మ గురించి తలుచుకోవద్దు అంటారు... తలుచుకోకుండా ఎలా ఉంటాను(కన్నీళ్లు పెట్టుకుంటూ...), ఒక్కోసారి సడెన్ గా అదే గుర్తొస్తుంది. అలాంటి సమయంలో ఈ నలుగురు నాకు సపోర్టుగా నిలిచారు... అని రాజశేఖర్ అన్నారు.

   నాకు సినిమా పిచ్చి

  నాకు సినిమా పిచ్చి

  మామూలుగా పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు... కానీ సినిమా చేసి చూడు అని నేను చెబుతాను. ఎవడ్రా నిన్ను సినిమా చేయమని అడిగాడు అని కొందరు అనొచ్చు. ఎవరూ చేయమనలేదు, కానీ నాకు సినిమా పిచ్చి. ఎంబీబీఎస్ చదివేసి సినిమాల్లోకి వచ్చింది అందుకే. అమ్మ పోయినా సరే నాకు చాలా మంది అమ్మలు లేడీ ఫ్యాన్స్ రూపంలో ఉన్నారు. నేను పడిన కష్టాన్ని థియేటర్ కు వచ్చి చూడండి. థియేటర్లో చూస్తేనే చాలా బావుంటుంది.... అని రాజశేఖర్ వ్యాఖ్యానించారు.

  English summary
  PSV Garuda Vega Release Mission Event held at Hyderabad. Rajasekhar, Pooja Kumar, Shraddha Das, Sunny Leone, Praveen Sattaru, M Koteswara Raju, Murali Srinivas, Shivani, Sivatmika, Jeevitha, Manjusha, Malkapuram Shivakumar at the event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X