»   » 'గడ్డం గ్యాంగ్‌' లో రాజశేఖర్ చేరారు

'గడ్డం గ్యాంగ్‌' లో రాజశేఖర్ చేరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజశేఖర్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం 'గడ్డం గ్యాంగ్‌'. అంజలి లవానియా హీరోయిన్. పి.సంతోష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జీవితా రాజశేఖర్‌ నిర్మాత. ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తమిళంలో విజయవంతమైన 'సూదుకవ్వమ్‌'కిది రీమేక్‌. ఆద్యంతం వినోదం, ఉత్కంఠని అందించే ఈ చిత్రం వచ్చే నెల మొదటి వారం నుంచి సెట్స్‌పైకి వెళ్తుంది. నలుగురు కిడ్నాపర్ల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. చిత్రానికి ఛాయాగ్రహణం: డేమిల్‌ గ్జావియర్‌ ఎడ్వర్డ్స్‌, సంగీతం: అచ్చు. కళ: వెంకట్‌, ఛాయాగ్రహణం: రిచర్డ్‌ కెవిన్‌

Rajasekhar starts new film 'Gaddam Gang'

మరోప్రక్క 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌'తో భారీ విజయాన్ని సొంతం చేసుకొన్న హిందీ దర్శకుడు రోహిత్‌ శెట్టి కన్ను సైతం 'సూదు కవ్వుమ్‌' పై పడింది. ఈ తమిళ చిత్రాన్ని రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. అన్ని ప్రాంతాలకు తగ్గట్టుగా ఉండే ఆ కథపై తాజాగా హిందీ దర్శకుడు రోహిత్‌శెట్టి మనసుపడ్డాడట. ఆ చిత్రం రీమేక్‌ హక్కులను సొంతం చేసుకొన్న రాక్‌లైన్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి రోహిత్‌శెట్టి ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో తెరకెక్కించేందుకు ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఇందులో హీరో,హీరోయిన్స్ గా ఇమ్రాన్‌ఖాన్‌, శ్రద్ధాకపూర్‌లను ఎంచుకొన్నట్టు ఆ సినిమావర్గాలు వెల్లడించాయి.

మరో ప్రక్క రామ్ గోపాల్ వర్మ హీరో రాజశేఖర్ తో పట్టపగలు చిత్రం చేస్తున్నారు అనే సంగతి తెలిసిందే. పూర్తి హర్రర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్వాతి దీక్షిత్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రాన్ని సైతం రాజశేఖర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన ఈ చిత్రంలో రాజశేఖర్ విభిన్నంగా తన నేచురల్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని, ట్రైలర్ ని ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 15 రోజులు రెగ్యులర్ షూటింగ్ లో ఈ చిత్రం ఫినిష్ చేసాడని,త్వరలోనే విడుదల చేస్తున్నాడని వినికిడి.

English summary
Soodhu Kavvum, will now be made in Telugu. Rajashekar will be remaking this film as Gaddam Gang in Tollywood. Anjali Lavania ( Panjaa fame) will act as the leading lady of this remake. Newcomer P Sanosh directs while Jeevitha Rajasekhar produces the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu