»   »  గ్రీన్ సిగ్నల్, గోపీచంద్ కు హీరో రాజశేఖర్ తోనే సమస్యలు

గ్రీన్ సిగ్నల్, గోపీచంద్ కు హీరో రాజశేఖర్ తోనే సమస్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిజమే...హీరో గోపిచంద్ కు సీనియర్ హీరో రాజశేఖర్ తో సమస్యలు రానున్నాయి. అయితే నిజ జీవితంలో కాదండోయ్...త్వరలో రాజశేఖర్ విలన్ గా గోపీచంద్ హీరోగా ఓ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ ..అడుగడుగునా గోపిచంద్ కు సమస్యలు సృష్టించే పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

ఇటీవలి కాలంలో హీరో జగపతిబాబు విలన్‌గా మారి, వరుస విజయాలు అందుకుంటున్న నేపథ్యంలో రాజశేఖర్ విలన్‌గా ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆయన విలన్ గా రీ ఇంట్రీ ఇవ్వడంపై తెలుగు సినీ సీమలో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. హీరో గోపీచంద్ కు ఆయన విలన్ గా కనిపించనున్నారు.

రాజశేఖర్ తన కెరీర్ తొలినాళ్ళలో 'తలంబ్రాలు' చిత్రంలో నెగిటివ్ రోల్ చేశారు. మరో ప్రక్క 'అహం'లో రాజశేఖర్ పాత్రను నెగిటివ్ గా , విభిన్నంగా ఆవిష్కరించడానికి తేజ సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి అధికారిక సమాచారం త్వరలోనే తెలియనుంది.

Rajashekar As Hero Gopichand's Villain

ఆహుతి, తలంబ్రాలు చిత్రాలతో నెగిటివ్ రోల్స్ తోనే కెరీర్ మొదలెట్టి హీరో గా సక్సెస్ అయిన రాజశేఖర్ మళ్లీ విలన్ గా చేస్తే తమ సినిమాకు మైలేజి బాగా వస్తుందని భావించిన దర్శకుడు శ్రీవాస్..ఆయన్ని కలిసి ఒప్పించినట్లు సమాచారం. హీరో మరెవరో కాదు గోపీచంద్.

గోపీచంద్ తో 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాలు చేసి హిట్ కొట్టిన దర్శకుడు శ్రీవాస్‌. ఇప్పుడు ఈ కాంబినేషన్‌ హ్యాట్రిక్‌ కొట్టాలని తన బ్యానర్ పైనే సినిమా చేస్తున్నారు. ప్రాజెక్టుకు క్రేజ్ తేవటానికి ఈ చిత్రంలో విలన్ గా రాజశేఖర్‌ని ఎంచుకొన్నట్టు సమాచారం.

ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. యాక్షన్‌, వినోదం మేళవించిన ఈ చిత్రంలో కుటుంబ బంధాలకూ ప్రాధాన్యం ఉంటుందని శ్రీవాస్‌ చెబుతున్నారు. గోపీచంద్‌ ప్రస్తుతం 'ఆక్సిజన్‌' చిత్రంతో బిజీగా ఉన్నారు. అది పూర్తయ్యాకే శ్రీవాస్‌ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

English summary
Director Sriwas has approached Senior hero Rajashekar with a powerful villain role for his upcoming film with actor Gopichand.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu