»   » రాజశేఖర్ ‘అహం’ పూరిత ప్రవర్తన...

రాజశేఖర్ ‘అహం’ పూరిత ప్రవర్తన...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిత్రం, నువ్వు-నేను, జయం వంటి విభిన్నమైన సూపర్ డూపర్ హిట్ ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడు తేజ డైరెక్షన్ లో వైష్ణవి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై పి.సత్యనారాయణ రెడ్డి అండ్ ఫ్రెండ్స్ నిర్మాతలుగా నూతన చిత్రం ‘అహం' ప్రారంభం కానుంది.

పవన్ కళ్యాణ్ సాంగుకు హీరో రాజశేఖర్ డాన్స్

 Rajashekar to Play Villain's Role

ఈ చిత్రం ద్వారా ఓ నూతన కథానాయకుడు పరిచయం అవుతున్నారు. అంకుశం, మ‌గాడు, అగ్ర‌హం, అహుతి, ఎవ‌డైతే నాకేంటి వంటి ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో హీరోగా న‌టించి టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న డా.రాజశేఖర్ ఈ చిత్రంలో విలన్ గా సరికొత్త క్యారెక్ట‌ర్‌లో నటిస్తుండటం విశేషం.

రాజశేఖర్ సరసన ఓ స్టార్ హీరోయిన్ నటిస్తుంది. నారాయణ్ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

English summary
Tollywood actor Rajashekar to turn villain with Teja’s “Aham”.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu