»   » ఎన్టీఆర్ చేయలేనిది రాజేంద్రప్రసాద్ చేశారు!

ఎన్టీఆర్ చేయలేనిది రాజేంద్రప్రసాద్ చేశారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజేంద్రప్రసాద్ మరో విభిన్న పాత్రలో ప్రేక్షకులను రంజింపచేయడానికి సిద్దమవుతున్నారు. లక్మీ మీడియా సంస్థ నిర్మిస్తోన్న 'బ్రహ్మ లోకం టు యమలోకం" (వయా భూలోకం) లో ఆయన బ్రహ్మదేవునిగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఈ చిత్రం ద్వారా రచయిత గోళ్లపాటి నాగేశ్వరరావు దర్శకునిగా పరిచయమవుతున్నారు. యుతోపియా ప్రొడక్షన్స్ (ప్రై) లిమిటెడ్ సమర్పణలో బెక్కెం వేణుగోపాల్, రూపేష్ డి గోహిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్, శివాజి, సోనియా, ఆర్తి అగర్వాల్, కల్యాణి ఇందులో ముఖ్యతారలు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 'వినోదమే ప్రధానంగా రూపొందుతోన్న సోషియో ఫాంటసీ చిత్రమిది. ఇందులో బ్రహ్మదేవునిగా రాజేంద్రప్రసాద్ అభినయిస్తున్నారు. ఎన్టీఆర్, ఎస్వీరంగారావు లాంటి మహానుభావులు అనేక రకాల పౌరాణిక పాత్రలు పోషించారు. పౌరాణిక పాత్ర పోషణలో వారి తర్వాతే ఎవరైనా అని చెప్పుకోవాలి. వారిద్దరూ చేయని పాత్ర బ్రహ్మదేవుడు. వారిద్దరూ కేవలం రాజేంద్రప్రసాద్ కోసమే ఈ పాత్ర చేయకుండా వదిలేసినట్టున్నారు. తొలిరోజు ఈ పాత్రలో ఆయనను చూసి ఒక తన్మయావస్థకు గురయ్యాం.

ఈ పాత్రను ఇంతకన్నా బాగా ఎవరూ చేయలేరన్నంత స్థాయిలో అభినయ ప్రదర్శన చేశారు. బ్రహ్మదేవునికి నాలుగు తలలు ఉంటాయి. సాధారణంగా అన్ని సినిమాల్లోనూ మిగతా మూడు తలల్ని ఆర్ట్ఫిషియల్‌గా చూపించారు. మేం మాత్రం నాలుగు తలలు లైవ్‌గా ఉన్నట్టు చిత్రీకరిస్తున్నాం. గత నాలుగు నెలలుగా ఇందుకు సంబంధించిన గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది. గంట నిడివిగల విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం కన్నుల పండువగా రూపొందుతోంది" అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ 'సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తికావస్తోంది. సినిమా చాలా రిచ్‌గా వస్తోంది. రాజేంద్రప్రసాద్ బ్రహ్మ పాత్ర నభూతో నభవిష్యత్‌లా రూపొందింది" అని చెప్పారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu