»   » ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్, ఏకగ్రీవమేనా?

‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్, ఏకగ్రీవమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ పోటీ చేయనున్నారు. రాజేంద్ర ప్రసాద్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 29న మా కార్యవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు మురళీ మోహన్ కొనసాగుతున్నారు.

మా అధ్యక్షుడిగా సేవలందించాలని ఉందని రాజేంద్ర ప్రసాద్ తన మనసులోని మాటను బయట పెట్టారు. ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పిన రాజేంద్రప్రసాద్.... ఒకవేళ మా అధ్యక్ష పదవికి పోటీ ఉన్నా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్న మురళీ మోహన్ స్థానం ఖాళీ అయితే కొత్త వ్యక్తి రావాలని పలువురు ఆర్టిస్టులు కోరుకుంటున్నారు. రాజేంద్రప్రసాద్ మా అధ్యక్ష పదవికి అన్ని విధాలా అర్హుడని పలువురు ఆర్టిస్టులు అభిప్రాయ పడుతున్నారు.

Rajendra Prasad contesting MAA elections

రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు. ఆయన పండించే హాస్యం తెలుగు సినిమా ను ప్రపంచస్థాయికి తీసుకెల్లింది. ఆయన నటించిన సినిమాలలో అహ నా పెల్లంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్ర్ఫిల్ 1 విడుదల, మాయలోడు మంచిపేరు తెఛ్ఛిపెట్టాయి. వయసు పైబడ్డాక ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. వయసు పైబడ్డాక ‘ఆ నలుగురు', ‘ఓనమాలు' లాంటి మంచి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.

English summary
Versatile actor Dr Rajendra Prasad has announced that he will be contesting in Movie Artists Association (MAA) elections in the capacity of the President soon.
Please Wait while comments are loading...