»   » సుకుమార్ మూవీ: జూ ఎన్టీఆర్ తండ్రి, మామ ఖరారయ్యారు!

సుకుమార్ మూవీ: జూ ఎన్టీఆర్ తండ్రి, మామ ఖరారయ్యారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సుకుమార్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రానున్న ‘నాన్నకు ప్రేమతో'(వర్కింగ్ టైటిల్) చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి పాత్ర, మామ పాత్రలకు ఇద్దరు ప్రముఖ నటులను ఎంపిక చేసారు. తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్‌ను, మామ పాత్రకు జగపతి బాబును ఎంపిక చేసినట్లు సమాచారం. జగపతిబాబు కూతురుగా, ఎన్టీఆర్‌కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. జగపతి బాబు పాత్ర నెగెటివ్ షేడ్స్ తో ఉంటుందని టాక్.

 Rajendra Prasad to play Jr NTR's father

బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో ఈ చిత్రాన్ని తెరకెక్కుతోంది. జూన్ 29 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్ లండన్లో ప్లాన్ చేస్తున్నారు. తొలుత ఎన్టీఆర్ తండ్రి పాత్రకు మోహన్ అనుకున్నప్పటికీ చివరకు రాజేంద్ర ప్రసాద్‌ను ఖరారు చేసారు.

లండన్లో దాదాపు 45 రోజుల పాటు షూటింగ్ జరుపుతారు. కీలకమైన సన్నివేశాలతో పాటు పాటలూ తెరకెక్కిస్తారు. ఈలోగా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత సారథ్యంలో పాటల్ని సిద్ధం చేస్తున్నారు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే కథ ఇది. తండ్రి ఆశయాల్ని నెరవేర్చే తనయుడిగా ఎన్టీఆర్‌ కనిపిస్తారు. ఈ చిత్రానికి 'నాన్నకు ప్రేమతో' అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కో-ప్రొడ్యూసర్: భోగవల్లి బాపినీడు, సమర్పణ: రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్: నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్.

English summary
Veteran actor Rajendra Prasad has been roped in to play Jr NTR's father in his upcoming tentatively titled Telugu, directed by Sukumar.
Please Wait while comments are loading...