twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వారిని మనవైపు లాగుతున్న రజనీకాంత్!

    By Bojja Kumar
    |

    హీరో రజనీకాంత్ జపనీయులను భారతీయ సినిమావైపు లాగుతున్నాడు. రజనీ కాంత్ మూలంగానే ప్రస్తుతం భారతీయ సినిమాకు జపాన్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ముంబైలో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ వచ్చిన జపాద్ కు చెందిన ఒక వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ...రజనీ సినిమా ద్వారానే తమకు భారతీయ సినిమాలపై ఆసక్తి పెరిగిందని చెప్పారు.

    సూపర్ స్టార్ రజనీకాంత్. బస్ కండక్టర్ గా జీవితం ప్రారంభించిన రజనీ తమిళ స్టార్ గా, ఆపై ఇండియన్ సూపర్ స్టార్ గా ఎదగడమే కాదు..విదేశాల్లోనూ అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా జపాన్, కొరియా లాంటి దేశాల్లో రజనీకీ అభిమానులు చాలా మందే ఉన్నారు. 15 ఏళ్ల క్రితం విడుదలైన ముత్తు సినిమా జపాన్ లో 'డాన్సింగ్ మహరాజా" పేరుతో విడుదలై అక్కడ భారీ విజయం సొంతం చేసుకుంది.

    ఇటీవల వచ్చిన రోబొట్(తెలుగులో రోబో) జపాన్ లో సూపర్ కలెక్షన్లు సాధించాయి. ఇలా భారతీయ సినిమాలపై వ్యామోహం పెంచుకున్నారు జపనీయులు. ఆ క్రమంలోనే అమీర్ ఖాన్ '3 ఇడియట్స్" సినిమా జపాన్ లో విజయం సాధించింది. ఇలా రజనీ వేసిన బాటలో నడిచి మరికొందరు కూడా జపాన్ సినీ మార్కెట్లోకి ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు ఉదా హరణ తాజాగా రూపొందిన షారుఖ్ ఖాన్ 'రా.వన్" సినిమా జపాన్ లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండటమే.

    English summary
    Rajinikanth can certainly make all impossible things happen and we mean literally. The Rajini fever has gripped a senior official from the oldest film production studio in Japan, who is presently in India’s financial capital to attend the ongoing Mumbai International film festival.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X