»   » రజనీ, అల్లు అర్జున్ నో చెప్పారు... హిట్టు మిస్సయ్యారు!

రజనీ, అల్లు అర్జున్ నో చెప్పారు... హిట్టు మిస్సయ్యారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘బజ్రంగి భాయిజాన్' సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం నమోదు చేసింది. వాస్తవానికి ఈ సినిమా కోసం తొలుత రజనీకాంత్‌ను సంప్రదించారట. అతను రిజక్ట్ చేయడంతో ఆ తర్వాత అల్లు అర్జున్ వద్దకు ఆ కథ చేరింది. బన్నీ కూడా నో చెప్పడంతో కథ సల్మాన్ వద్దకు చేరింది.

సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, నవాజుద్దీస్ సిద్ధికీ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్, రాక్ లైన్ వెంకటేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సల్మాన్ ఖాన్ అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతో పూర్తి విందులా ఈ చిత్రం ఉంది.

 Rajinikanth and Allu Arjun Reject Bajrangi Bhaijaan

కాగా...ఇక ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన నాటి నుండీ ఇది చిరంజీవి సూపర్ హిట్ చిత్రం పసివాడి ప్రాణం కథ నుంచి ప్రేరణ పొందింది అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు రిలీజై అంతటా అదే జోరుగా వినిపిస్తోంది. ఈ విషయమై ఈ చిత్రం కథ రచయిత విజయేంద్రప్రసాద్ సైతం నిజమైనన్నట్లు సమాచారం.

విజియేంద్రప్రసాద్ మాట్లాడుతూ...చిరంజీవి 1987లో నటించిన పసివాడి ప్రాణం చిత్రం నన్ను అప్పట్లో బాగా కదిలించింది. దాన్ని పూర్తి మార్పులతో కాంటెంపరెరీ టచ్ ఇచ్చి చేయాలనుకున్నట్లు తెలిపారు. ఈ లోగా తాను ఓ పాకిస్దానీ జంట...తమ కుమార్తెకు గుండె ఆపరేషన్ నిమిత్తం ఇండియాకు వచ్చినట్లు..అక్కడ ఖర్చు భరించలేక ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నట్లు మీడియాలో వార్త రావటం గమనించానని..కథని సిద్దం చేసానని అన్నారు. పసివాడి ప్రాణం సినిమాలో మూగ అబ్బాయి చుట్టూ కథ తిరిగితే..ఇక్కడ మూగ అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుంది.

English summary
Stylish Star Allu Arjun and Rajinikanth Rejected Veteran Writer Vijayendra Prasad Bajarangi Bhaijaan Story.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu