For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నా సినీ జీవితంలో ఇదో గొప్ప చిత్రం : రజనీకాంత్

  By Srikanya
  |
  హైదరాబాద్ : ''నా సినీ జీవితంలో ఇదో గొప్ప చిత్రమవుతుంది. మరో మైలురాయిగా నిలుస్తుంది''అన్నారు రజనీకాంత్. రజనీకాంత్‌ నటించిన యానిమేషన్‌ చిత్రం 'కోచ్చడయాన్‌' వేసవిలో తెరపైకి రాబోతోంది. ఈ సినిమా తెలుగులోకి 'విక్రమసింహ' పేరుతో అనువాదమవుతోంది. ఈ క్రమంలో చిత్రాన్ని రజనీకాంత్‌ చెన్నైలో తిలకించారు. ఈ సందర్భంగా రజనీ ఇలా స్పందించారు.

  ఇక రజనీ చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించారు. ''నా జీవితంలో మరచిపోలేని రోజు ఇది. నాన్నగారు, రవికుమార్ అంకుల్, ఇతర టీమ్ సభ్యులు ఈ సినిమా మొదటి కాపీ చూసి, చాలా థ్రిల్ అయ్యారు'' అని సౌందర్య ట్విట్టర్‌లో రాసారు. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్ . 'అవతార్‌', 'టిన్‌ టిన్‌' చిత్రాల తరహాలో క్యాప్చర్‌ మోషన్‌ టెక్నాలజీని వినియోగించారు.చిత్రీకరణ, ఎడిటింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

  దర్శకత్వ పర్యవేక్షణ చేసిన కె.ఎస్‌.రవికుమార్‌ మాట్లాడుతూ ''ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచేలా ఉంటుది''అన్నారు. ఎనిమిదో శతాబ్దానికి చెందిన రాజుల కథ ఇది. ఈ సినిమాకి ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. వచ్చే నెలలో పాటల్నీ, మేలో చిత్రాన్నీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని తెలిసింది. శరత్‌కుమార్‌, శోభన, జాకీష్రాఫ్‌, ఆది, నాజర్‌, రుక్మిణి తదితరులు నటించారు. ఈ నెల 15న డబ్బింగ్, రీ-రికార్డింగ్, స్పెషల్ ఎఫెక్ట్స్ పనులు ఆరంభిస్తామని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు లండన్ లోని పీనివుడ్స్ స్టూడియోలో జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదలవుతుందని భావిస్తున్నారు.

  ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ జయ టీవీకి అత్యధిక రేటుకు అమ్మినట్లు సమాచారం. కొచ్చడయాన్ డైలాగ్స్ నింపిన సెల్ఫోన్లను రింగ్ టోన్స్గా పెట్టి ఒక సంస్థ ఏకంగా ఐదు లక్షల సెల్ఫోన్లను విడుదల చేయనుంది. రజనీ కాంత్ స్థాయికి తగిన రీతిలో ఈ సినిమా మార్కెట్ అవుతోంది. అలాగే ఈ సినిమాలో నటించేందుకు చెన్నై ప్రభుత్వ ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీ నుంచి 42 మంది విద్యార్థులను, కుంభకోణం ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీ నుంచి 50 మంది విద్యార్థులను సౌందర్య ఎంపిక చేశారు. ఈ సినిమాకు మరో విశేషం ఏంటంటే జీవితసారాన్ని తెలియజెప్పే ఓ అద్భుతమైన పాటను రజినీకాంత్‌ పాడారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్‌ సంగీతంలో రూపొందించిన ఈ పాటను వైరముత్తు రాశారు. రజనీ జపాన్ అభిమానుల ముచ్చట తీర్చేవిధంగా కొన్ని ప్రత్యేక దృశ్యాలు చిత్రీకరించారు.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X