»   » కావాలనే రజినీ పై రాద్దాంతం: మనమంటే చిన్న చూపు మరోసారి బయట పెట్టుకున్న బాలీవుడ్

కావాలనే రజినీ పై రాద్దాంతం: మనమంటే చిన్న చూపు మరోసారి బయట పెట్టుకున్న బాలీవుడ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు కేవలం దక్షిణ భారతదేశంలోనే కాదు.. దేశవ్యాప్తంగా.. ఆ మాటకొస్తే విదేశాల్లో కూడా అభిమానగణం ఉంది. ఈ విషయంలో ఆయనకు సరిపోయే భారతీయ హీరోయే లేడు. ప్రస్తుతం ఆయన శంకర్‌ దర్శకత్వంలో 'రోబో 2.0'లో నటిస్తున్నాడు. గత ఆదివారం సాయంత్రం ముంబైలో జరిగిన 'రోబో 2.0' ఫస్ట్‌లుక్‌ లాంచ్‌ కార్యక్రమంలో పాల్గొన్న రజనీ చేసిన ఓ కామెంట్‌ వివాదాస్పదంగా మారింది. అయితే ఆ సమయంలో రజనీ చేసిన ఒక కామెంట్.. అక్కడి మీడియా వారినే కాదు.. అక్కడి సెలబ్రిటీలను కూడా హర్ట్ చేసిందట. కాకపోతే ఆయన చేసిన కామెంట్ ఏంటంటే.. 'నో కామెంట్' అన్నారంతే. దానికే అంత రచ్చా?? అనుకుంటున్నారా.... ఇంతకీ జరిందేమిటంటే

ఈ ఫస్ట్ లుక్ లాంచ్ ముంబైలో బాలీవుడ్ ఫిలింమేకర్ కరణ్ జోహార్ ఈ గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ 270 డిగ్రీ స్క్రీన్ ప్రత్యేకంగా పెట్టారు. ఈ ఈవెంట్ కి వచ్చిన ఉన్నత అతిథులకు 3డి ఫస్ట్ లుక్ అనుభవాన్ని కలిపించారు. సల్మాన్ ఖాన్ కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. అద్భుతమైన విజువల్ కోలాహలంతో మాటల్లో చెప్పలేని అనుభవం కలిగించారు.కార్యక్రమంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, హీరో అక్షయ్‌కుమార్‌, హీరో సల్మాన్‌ఖాన్‌, డైరెక్టర్‌ శంకర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎ.ఆర్‌.రెహమాన్‌, నిర్మాత సుభాష్‌ కరణ్‌, విఎఫ్‌ఎక్స్‌ వాల్ట్‌ జోన్స్‌, హీరోలు ఆర్య, విజయ్‌ ఆంటోనీ, సినిమాటోగ్రాఫర్‌ నిరవ్‌ షా, ఫైట్‌ మాస్టర్‌ సెల్వ, ప్రముఖ నిర్మాతలు ఎ.ఎం.రత్నం, బెల్లంకొండ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Rajinikanth No Comment hurts Bollywood

ప్రోగ్రాం అయ్యాక అక్కడి బాలీవుడ్ మీడియాతో ప్రశ్నోత్తరాలు సమయంలో రజనీకాంత్ ను ఒక ప్రశ్న అడిగాడు ఒక ఘనుడు. ''మీరు ఇండియా అంతా ఒక రేంజ్ సూపర్ స్టార్. మీ స్టార్డమ్ చాలా డిఫరెంట్. మీకు స్టార్ హీరోలే ఫ్యాన్లు. ఒకవేళ బాలీవుడ్ లో మీ అంతటి స్టార్డమ్ ఉన్న హీరోలు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరి పేరు చెబుతారు?'' అంటూ ప్రశ్నించాడు అతను. దీనికి సమాధానంగా రజనీ ''నో కామెంట్'' అన్నారు. నిజానికి ఎవరో ఒక్కరి పేరును చెప్పడం ఇష్టం లేని రజనీ.. అలా నో కామెంట్ అన్నారని మనకు అర్ధమవుతోంది. కాని బాలీవుడ్లో మాత్రం.. అసలు రజనీ 'నో కామెంట్' అన్నారంటే.. ఆయన రేంజ్ స్టార్ ఇక్కడ లేరనేగా ఆయన మీనింగ్ అంటూ జనాలు తెగ ఫీలవుతున్నారట.

అంటే అన్నామమంటారు గానీ ఔను రజినీ కంటే తోపు ఎవరున్నారు.... బాలీవుడ్ లో లెజెండ్స్ ఉండొచ్చు గాక రజినీకాంత్ లాంటి ఒక్క స్టార్ ని అక్కద చూపగలరా..?? ఆ భష ఈ భాష అనికాదు ఒక సౌత్ ఇండియన్ సినిమానీ ఈ బాలీవుడ్ జనాలే హేలన చేసే సమయం లోనే వెదేశాల్లో కూదా విజిల్సేయించిన రజినీకంటే పెద్ద హీరో బాలీవుద్ లో ఉన్నాడా??

English summary
When Rajni is asked about anyone from Bollywood who could make up to his kind of stardom and range, Rajni replied "No Comment". Actually he should have taken the names of someone like Amitabh Bachhan or anyone, but as he didn't want to hurt any, he hasn't commented.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu