»   » డియర్ మోడీ అంటూ రజనీ...పవన్, సల్మాన్, షారుక్ హ్యాపీ!

డియర్ మోడీ అంటూ రజనీ...పవన్, సల్మాన్, షారుక్ హ్యాపీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధాని కాబోతున్న నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేసారు. మొదటి నుండి మోడీకి మద్దతుగా నిలిచిన సౌత్ స్టార్ హీరోలు రజనీకాంత్, తెలుగు స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఆయనకు కంగ్రాట్స్ తెలిపారు.

ఇటీవల ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన రజనీకాంత్ మోడీ విజయంపై ట్విట్టర్లో స్పందిస్తూ....'చారిత్రాత్మక విజయం సాధించిన డియర్ నరేంద్ర మోడీజీకి హార్టీ కంగ్యాజ్యులేషన్స్' అంటూ ట్వీట్ చేసారు. మరో వైపు తెలుగు స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఫలితాలపై సంతోషం వ్యక్తం చేసారు.

వీరితో పాటు పలువురు సినీ తారలు కూడా మోడీకి అభినందనలు తెలిపారు. వారికి సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

రజనీకాంత్

రజనీకాంత్

చారిత్రాత్మక విజయం సాధించిన డియర్ నరేంద్ర మోడీజీకి హార్టీ కంగ్యాజ్యులేషన్స్' అంటూ ట్వీట్ చేసారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ మోడీ విజయంపై హర్షం వ్యక్తం చేసారు.

రాహుల్ రవీంద్రన్

రాహుల్ రవీంద్రన్

హంగ్ భయం లేకుండా మోడీకి పూర్తి మెజారిటీ వచ్చింది. ఈ సారి తప్పకుండా ప్రభుత్వం 5 సంవత్సరాలు నిలబడుతుంది. ఇది నిజంగా గుడ్ న్యూస్ అంటూ ట్వీట్ చేసారు.

గణేష్ వెంకట్రామన్

గణేష్ వెంకట్రామన్

మెడీ గెలుపు భారత ప్రజల గెలుపు. మొత్తానికి అనుకున్నది సాధించాం అంటూ ట్వీట్ చేసారు.

ధనుష్

ధనుష్

ప్రజలు కోరుకున్నట్లే మార్పు జరిగింది. ఇక అంతా మంచే జరుగుతుంది.

నజ్రియా నజీమ్

నజ్రియా నజీమ్

ఇండియా మార్పుకు సిద్ధమవుతోంది. కంగ్రాట్స్ నమో!

బాలీవుడ్ స్టార్లు

బాలీవుడ్ స్టార్లు

మోడీ గెలుపుపై బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, హేమా మాలిని, ఆశా బోంస్లే, మధుర్ బండార్కర్, ప్రీతి జింతా, ప్రితిష్ నందీ, అనుపమ్ ఖేర్, చిత్రాంగద సింగ్, సోహా అలీ ఖాన్, వివేక్ ఒబెరాయ్, అభిషేక్ కపూర్, పునీత్ మల్హోత్రా, సోఫీ చౌదరి, విశాల్ దల్దానీ, రణవీర్ షోరే ఆనందం వ్యక్తం చేసారు.

English summary
BJP's Prime Ministerial candidate Narendra Modi has registered a thumping victory in the loksabha elections 2014. While all his followers across the globe are celebrating the occasion, his fans and friends are congratulating him for the success.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu