»   » అమీర్ బతిమాలినా.., రజినీ నో చెప్పాడు..... నేను మిస్టర్ పర్ఫెక్ట్ నికాదు అంటూ....

అమీర్ బతిమాలినా.., రజినీ నో చెప్పాడు..... నేను మిస్టర్ పర్ఫెక్ట్ నికాదు అంటూ....

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒక్కో సినిమా ఒక కొత్త ఆలోచన, మరెవరూ ఊహించని జానర్, అమీర్ సినిమా వచ్చిందీ అంటే అందరి దృష్టీ ముందు వెళ్ళేది ఈసారి పత్రలో ఎలా ఒదిగిపోయాడో అని చూడటానికే... అందుకే ఏ రెండు సినిమాల్లోనీ అమీర్ బాడీ లాంగ్వేజ్ ఒకలా ఉండదు... మిమిక్రీ ఆర్టిస్టులూ, ఇమిటేట్చేస్తూ కామెడీ పండించే కమేడియన్లూ షారూఖ్, సల్మాన్లని అనుకరించినా అమీర్ ని పట్టుకోలేకపోవటానికి ఇదే కారణం. అందుకే అమీర్ సినిమాలని ఇష్ట పడే వాళ్ళంతా అతనికిచ్చిన ట్యాగ్ మిస్టర్ పర్ఫెక్ట్ అని.

అయితే తాను మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్ కాదు, మిస్టర్ ఫ్యాషన్‌ అని చెప్పుకొచ్చాడు. 'దంగల్' సినిమాలో నితీష్ తివారీ పాత్రలో ఆమిర్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌లో భాగంగా ఆమిర్ మీడియాతో మాట్లాడిన అమీర్ ఖాన్ మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌గా తాను ఏనాడూ ఫీల్ అవ్వలేదని, ఆ పదం తనకు సరిపోదనిపిస్తుందీ అంటూ కాస్త సిగ్గు ప్రదర్శించడు. . సినీ పరిశ్రమ గొప్ప క్రియేటివిటీ కలిగిందని, ఈ పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికి వైవిధ్యమైన అభిప్రాయాలు, అభిరుచులు ఉంటాయన్నారు. కొంగొత్త ఆలోచనలకు నెలవైన సినీ ఫీల్డ్‌లో తాను ఒక్కడినే సంపూర్ణమైన వ్యక్తిని ఎలా అవుతానని వ్యాఖ్యానించాడు. అసలు సమాజంలో సంపూర్ణం అనేదే లేదని, ఇందులో మరోమాట చెప్పడానికి కూడా ఆస్కారమే లేదన్నాడు.

Rajinikanth refused to dub for the Tamil version of Aamir Khan’s ‘Dangal’

ఇదిలా ఉంటే అన్నిభాషల్లో సినిమాని సూపర్ హిట్ చేద్దామన్న ఆలొచనకి రజినీ అడ్డుకట్ట వేసాడు మిస్టర్‌ పెర్‌ఫెక్ట్‌ అమీర్‌ఖాన్‌ నటించిన తాజా చిత్రం 'దంగల్‌'. 2010 కామన్వెల్త్‌ గేమ్స్‌లో సత్తా చాటిన రెజర్లు గీతా పొగట్‌ (స్వర్ణ పతకం), బబితా కుమారి (కాంస్య పతకం)లను తీర్చిదిద్దిన వారి తండ్రి మహావీర్‌ సింగ్‌ పొగాట్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. నితేశ్‌ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవలె విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ చిత్రాన్ని పలు భారతీయ భాషల్లో అనువదించాలని డిసైడ్‌ అయ్యాడు అమీర్‌. ఇతర భాషలతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను భారీగా విడుదల చేయాలని ప్లాన్‌ చేశాడు. అక్కడ క్రేజ్‌ పెంచేందుకు 'దంగల్‌' సినిమాలోని తన క్యారెక్టర్‌కు సూపర్‌స్టార్‌ రజనీ చేత డబ్బింగ్‌ చెప్పించాలని డిసైడ్‌ అయ్యాడు. ఆ మేరకు రజనీని కలుసుకుని 'దంగల్‌' సినిమాను స్పెషల్‌గా చూపించాడు. అయితే అమీర్‌ కోరికను రజనీ సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. సినిమా బాగుందని చెప్పినప్పటికీ, డబ్బింగ్‌ చెప్పేందుకు మాత్రం రజనీ ముందుకు రాలేదని సమాచారం.

English summary
Aamir Khan starrer ‘Dangal‘ that is up for release this month has met with a controversy. Apparently, South legend Rajinikanth was approached by Aamir Khan to dub for the Tamil version of the movie, but the actor refused the offer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu