»   » కాలా ఫస్ట్ రివ్యూ.. రజనీ, నానా ఇరదీశారట.. బాక్సాఫీస్ వద్ద భూకంపమే!

కాలా ఫస్ట్ రివ్యూ.. రజనీ, నానా ఇరదీశారట.. బాక్సాఫీస్ వద్ద భూకంపమే!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Kaala First Review బాక్సాఫీస్ వద్ద భూకంపమే..!

  సూపర్‌స్టార్ రజనీకాంత్‌ సినిమా వస్తున్నదంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వెండితెర మీద రజనీ చెప్పే డైలాగ్స్ ఫ్యాన్స్‌తో ఈలలు కొట్టకుండా ఉండలేరు. రజనీ అంటే పిచ్చి. అభిమానం ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కాలా చిత్రం జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన రివ్యూను సినీ విమర్శకుడు ఉమేర్ సంధూ వెల్లడించారు.

  స్టైలిష్ లుక్‌లో రజనీకాంత్

  స్టైలిష్ లుక్‌లో రజనీకాంత్

  కాలా చిత్రంలో రజనీ బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తరకంగా ఉంది. స్టైలిష్ లుక్‌లో అదరగొట్టాడు. ఆయన చెప్పే డైలాగ్స్‌కు ప్రేక్షకులు చప్పట్ల మోత మోగించకుండా ఉండలేరు. రజనీ ఇమేజ్‌కు తగినట్టుగా పా రంజిత్ అద్భుతంగా పాత్రను డిజైన్ చేశాడు. మల్టీప్లెక్స్ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా ఈ సినిమాను చక్కగా పా రంజిత్ తెరకెక్కించాడు. నేటి యువతరానికి కనెక్ట్ అయ్యేలా రజనీ పాత్రను రూపొందించారు.

  రజనీకాంత్ స్క్రీన్ ప్రజెన్స్

  రజనీకాంత్ స్క్రీన్ ప్రజెన్స్

  కాలా చిత్రంలోని ప్రతీ ఫ్రేమ్‌లో రజనీ చరిష్మా, స్క్రీన్ ప్రజెన్స్ వెండితెర మీద గ్రాండ్‌గా కనిపిస్తుంది. చిత్రంలోని కలర్ బ్యాలెన్స్, యాక్షన్ సీన్లు సూపర్బ్‌గా ఉంటాయి. టెక్నికల్‌గా కాలా చిత్రం ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతుంది. దక్షిణాదిలో ఇప్పటివరకు ఇంతగా భావోద్వేగానికి గురిచేసే చిత్రం రాకపోవచ్చు.

   కాలా చిత్రం పైసా వసూల్

  కాలా చిత్రం పైసా వసూల్

  సాంకేతికంగా పరిశీలిస్తే కాలా వెండితెర మీద కొత్త ఆవిష్కరణ. స్టోరి, స్క్రీన్ ప్లే పైసా వసూల్ అని చెప్పవచ్చు. గగుర్పాటుకు గురిచేసే యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. అద్భుతమైన సినిమాటోగ్రఫీ ప్రేక్షకుడిని గొప్ప ఫీలింగ్‌ను కలుగజేస్తుంది. ధారవి మురికివాడ సెట్ ఆకట్టుకొంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టెర్రిఫిక్. ఎడిటింగ్ విభాగం పనితీరు చాలా బాగుంది.

  రజనీకాంత్‌కు అవార్డులు ఖాయం

  రజనీకాంత్‌కు అవార్డులు ఖాయం

  పా రంజిత్ దర్శకత్వంలో ఎలాంటి లోపాలు కనిపించవు. చిత్రంలో ఏ ఒక్క సన్నివేశం కూడా అనవసరం అనిపించదు. అవార్డులు అందుకునే స్థాయిలో రజనీ నటన ఉంటుంది. సినిమా భారాన్ని మొత్తం రజనీకాంత్ మాత్రమే భుజాన ఎత్తుకొన్నాడు.

  నానా పాటేకర్ నటన హైలెట్

  నానా పాటేకర్ నటన హైలెట్

  నానా పాటేకర్ నటన నభూతో నభవిష్యత్ అని చెప్పవచ్చు. నానా నటనతో మరోసారి ఆకట్టుకొన్నాడు. హ్యుమా ఖురేష్, ఈశ్వరీరావు తన నటనతో ఆకట్టుకొన్నారు. మిగితా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.

  బాక్సాఫీస్ రికార్డులతో షేక్

  బాక్సాఫీస్ రికార్డులతో షేక్

  కాలా చిత్ర ఒపెనింగ్స్ ప్రపంచవ్యాప్తంగా దద్దరిల్లేలా ఉంటాయి. బాక్సాఫీస్‌ను కుదిపేయడం ఖాయం. మాస్ ప్రేక్షకులకు రజనీ మంచి వినోదాన్ని, డిస్టిబ్యూటర్లుకు ఆర్థిక లాభాలను పంచడానికి సిద్దమయ్యారు. ఓవరాల్‌గా బ్లాక్ బస్టర్ అని చెప్పడానికి నాకు ఎలాంటి సందేహం లేదు.

  యూఎస్‌లో ప్రీమియర్స్ షోలు

  యూఎస్‌లో ప్రీమియర్స్ షోలు

  ప్రపంచవ్యాప్తంగా కాలా చిత్రం జూన్ 7వ తేదీన రిలీజ్ కానున్నది. అమెరికాలో మాత్రం జూన్ 6వ తేదీ (బుధవారం) రాత్రి 11.30 గంటలకు (భారత కాలమానం) ప్రీమియర్ ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. రజనీ, నానా పాటేకర్, ఈశ్వరీరావు, హ్యూమా ఖురేష్ నటించిన ఈ చిత్రాన్ని హీరో ధనుష్ నిర్మించారు.

  English summary
  In Kaala, Rajnikanth has never looked so good on screen with his stylised look and presentation, Patori body language, and dialogue delivery. Pa. Ranjith has been able to get the right balance in a tightrope walk between Rajni’s larger-than-life image and the changing taste of today’s mass multiplex audience without losing his famous touch. In short, Pa. Ranjith has given us a more peppy and upmarket Rajni that is sure to work with today’s youth audience.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more