Just In
Don't Miss!
- News
భారత్ లో యూకే కరోనా స్ట్రెయిన్ కేసుల కలకలం ... 114కు పెరిగిన కేసులు
- Sports
పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లీనే అత్యుత్తమం.. జడేజా కూడా: శ్రీలంక పేసర్
- Finance
4 వారాల్లో అతిపెద్ద పతనం, ఇన్వెస్ట్ చేస్తున్నారా.. కాస్త జాగ్రత్త!
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘కబాలి’ యుఎస్ రివ్యూ : బోల్డు ప్లస్ లు, కొన్ని మైనస్ లు
హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కబాలి' చిత్రం రేపు (జూలై 22) విడుదలకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎలా ఉండబోతోంది..ఏ స్దాయి కలెక్షన్స్ రాబట్టబోతోంది , ఎలా ఉందో అని కబాలి అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ మూవీపై అభిమానులే కాదు చిత్ర యూనిట్ కూడా భారీ ఎక్స్‌పెక్టెషన్స్ పెట్టుకుంది.
ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడగా మలేషియా, సింగపూర్, అమెరికా, చైనా, జపాన్ వంటి పలు దేశాలు కూడా ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఇప్పటికే యుఎస్ లో విడుదలైంది. దాంతో కబాలి రివ్యూలు ఆన్ లైన్ లోనూ,సోషల్ మీడియాలోనూ మొదలయ్యాయి. బాలాజి శ్రీనివాసన్ అనే వ్యక్తి రాసిన రివ్యూ ఇక్కడ ఇస్తున్నాం.
ఆయన రివ్యూలో బే ఏరియా సినీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కు ధాంక్స్ చెప్పారాయన. వారి సాయింతో ప్రివ్యూ షో రాసానని అన్నారు. నేను ఏ ఎక్సపెక్టేషన్స్ లేకుండా సినిమా చూసి మిక్సెడ్ ఫీలింగ్స్ తో బయిటకు వచ్చాను. కబాలి రజనీ ఫ్యాన్స్ కు పైసా వసూల్ సినిమా అని చెప్పాలి. అయితే కొద్ది మందికి మాత్రం వయస్సు అయిపోయిన సూపర్ స్టార్ ని చూస్తూంటే ఫన్ గా అనిపిస్తుందని అన్నారు.
స్లైడ్ షో లో రివ్యూ చదవండి...

నేపధ్యం
తమిళులు మలేషియాలో చాలా ఇబ్బందులు పడుతూ, అక్కడ వారి చేత బాధలకు గురి అవుతూంటారు. వాళ్లను కాపాడటానికి ఓ దేవుడు లాంటి వ్యక్తి రావాలని చూస్తూంటారు. అదీ ఈ కథ నేపధ్యం

నెల్సన్ మండేలా
నెల్సన్ మండేలాను గుర్తు చేస్తూ..చాలా సంవత్సరాలు జైల్లో ఉండి బయిటకు వస్తాడు. ఆయన బయిటకు రాగానే రెగ్యులర్ లైఫ్ లోకి రాగానే ఇక్కడ పరిస్దితులు ఆయనలోని గ్యాంగస్టర్ ని నిద్రలేపుతాయి.

కూతురు కోసం
తన కుమార్తెని రక్షించుకోవటం కోసం తిరిగి కబాలి గా మారతాడు. ఆయన తమిళలు, మలేషియాలో ఉన్న దళితులు కు సాయిం చేస్తాడు. వారి జీవన మెరుగుదలకు సాయించేస్తాడు.

రజనీ ఫ్యాన్ గా...
రజనీ అబిమానిగా ఆయన స్టైల్స్ అద్బుతంగా నచ్చాయి. ముఖ్యంగా స్లో మేషన్ వాక్స్, స్టైలిషన్ పోజ్ లు, క్రిస్ప్ డైలాగులు అదరకొట్టాయి.

పాత స్టైల్స్ అయినా
చాలా వరకూ రజనీ తన పాత స్టైల్స్ నే చూపెట్టినా ధియోటర్ మాత్రం దద్దరిల్లిపోయినా జాగ్రత్తగా కొరియోగ్రాఫ్ చేసారు.

యూత్ గా
ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో యూత్ గా కనపడే రజనీ...ని చూసి అబిమానులు..పాత జ్ఢాపకాల్లో వెళ్లిపోతారు.

లార్జర్ దేన్ లైఫ్
డైరక్టర్ రంజిత్...చాలా జాగ్రత్తగా సీన్స్ లో లార్జర్ దేన్ లైఫ్ గా కనిపించే సీన్స్ ని రియలిస్టిక్ గా మలిచారు.

కలిపి
రజనీ లైఫ్ టైమ్ లో చేసిన హైలెట్ సీన్స్ అన్ని కలిపి మళ్లీ అందించిన ఫీల్ , ఆనందం కలిగింది.

కొంచెం కష్టమే
అయితే రజనీ ఫ్యాన్ కాకుండా ఓ కాజువల్ సిని గోయర్ గా ఈ సినిమా చాలా ఆర్టిఫిషియల్ గా , అన్ బేరబుల్ గా ఉంటుంది.

హెవీ మేకప్
రజనీకాంత్ హెవీ మేకప్ తో 30 ఏళ్ల వయస్సువాడిలా చూస్తూంటే ఇబ్బందిగా ఉంది.

ఊహించని గెస్ట్
ఈ సినిమాలో ఓ సర్పైజ్ గెస్ట్ రోల్ లో ఓ స్టార్ కనిపిస్తారు. రజనీ సినిమాలో ఎక్సపెక్ట్ చేయలేం అది.

దర్శకుడు గురించి..
‘కబాలి' దర్శకుడు పా.రంజిత్ అనుభవజ్ఞుడేమీ కాదు. ఇదివరకు ఆయన రెండంటే రెండే సినిమాలు తీశాడు. కానీ సినిమాకి అంత క్రేజ్ ఏర్పడిందంటే నిస్సందేహంగా అది రజనీ మేజిక్కే. మరి ‘కబాలి' రజనీ ఇమేజ్‌ని ఏమేరకు అందుకొంటుందన్న విషయం గురించే ఇప్పుడు యావత్ ప్రపంచం ఆసక్తికరంగా చూస్తోంది.

పోటీపడి
కబాలి విమానం, కబాలి బస్సు, కబాలి కారు, కబాలి భోజనం, కబాలి హోటల్... ఒకటేమిటి ఎక్కడ చూసినా కబాలినే! ఇదేం నిర్మాణ సంస్థ ప్రచార వ్యూహమేమీ కాదు. వ్యాపార సంస్థలే పోటీపడి మరీ కబాలిని ప్రచారం చేశాయి.

శెలవు
చెన్నై, బెంగుళూరులోని కొన్ని సంస్థలు జులై 22ని సెలవు దినంగా ప్రకటించాయి. ప్రేక్షకులకు కబాలి టిక్కెట్టు దొరకడమే గగనమైందిప్పుడు.

రెండు గంటల్లోనే...
తమిళనాడులో అయితే ఓ స్వచ్ఛంద సంస్థ మరుగుదొడ్లు కట్టించుకొన్నవారికే కబాలి టిక్కెట్లు అంటూ ప్రకటించిందట. అమెరికాలో ఆన్‌లైన్ బుకింగ్ ఓపెన్ చేసిన రెండు గంటల్లోనే టిక్కెట్లు అమ్ముడైపోయాయి.