రజనీకాంత్ యూఎస్ ఫొటోస్ లీక్.. హాస్పిటల్ నుంచి అలా బయటకు వస్తూ.. లోకల్ ట్రైన్‌లో..
సూపర్ స్టార్ రజనీకాంత్ గత కొంతకాలంగా ఆరోగ్య కారణాల వలన కాస్త నెమ్మదిగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. సినిమాలను కూడా చాలా లిమిటెడ్ గా చేసుకుంటూ వెళుతున్నారు. అయితే చాలా రోజుల అనంతరం సూపర్ స్టార్ సడన్ గా వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లడం ఇటీవల అభిమానులను కాస్త కంగారు పెట్టింది. ఇక మళ్ళీ ఇండియాకు సేఫ్ గానే తిరిగి వచ్చారు. అయితే తలైవా యూఎస్ లో ఉన్నప్పటికీ ఫొటోలు కొన్ని ఇటీవల సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

ఆ వయసులోనే..
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. తలైవా 60 ఏళ్ళ వయసులోనే సినిమాలకు గుడ్ భై చెప్పేసి పాలిటిక్స్ లో ఉండాలని అనుకున్నారు. కానీ అప్పటి నుంచే ఆయన ఆరోగ్య పరిస్థితులతో పాటు తమిళ రాజకీయా పరిస్థితులు కూడా అనుకూలించలేదు.

చివరికి నిరాశే మిగిలింది
ఈ ఏడాది రాజకీయాల్లోకి వచ్చి పోటీగా నిలవాలని బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నారు. తలైవా వస్తాడని గత కొన్నేళ్లుగా ఎదురుచూసిన అభిమానులకు చివరికి నిరాశే మిగిలింది. హఠాత్తుగా ఆరోగ్య పరిస్థితులు ఆయనకు ఏ మాత్రం సహకరీంచలేదు. అంతే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా రజనీకాంత్ రాజకీయాల్లోకి వెళ్లడం ఏ మాత్రం ఇష్టం లేదు.

కంటికి రెప్పలా
ఇక రాజకీయాలకు రాకముందే బయటకు వెళ్లిపోయిన రజనీకాంత్ ఆరోగ్య విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కూతరు సౌందర్య, ఐశ్వర్య ఇద్దరు కూడా తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఇక ఇటీవల వైద్య పరీక్షల కోసం అమెరికాకు తీసుకు వెళ్లారు.

ఫొటోస్ లీక్..
చికిత్స అనంతరం రజనీకాంత్ అక్కడే కుటుంబ సభ్యులతో కొన్ని రోజులు సరదగా గడిపారు. ఇక మావో క్లినిక్ అనే హాస్పిటల్ ముందు నడుస్తూ కనిపించగా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అదే విధంగా అక్కడి లోకల్ ట్రైన్స్ లో కూడా తలైవా సింపుల్ గా గాగుల్స్ పెట్టుకొని కనిపించాడు. ప్రస్తుతం రజనీకాంత్ శివ దర్శకత్వంలో అన్నత్తై అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











