»   »  వెబ్ సిరీస్ కోసం ఇంత రిస్కా..?? అసలు పోలికే లేదు

వెబ్ సిరీస్ కోసం ఇంత రిస్కా..?? అసలు పోలికే లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ నటుడు రాజకుమార్ రావు ఈ మధ్య కాలంలో షాహిద్ సినిమా నుండి నిన్న రాబ్తా సినిమా వరకు రాజ్ కుమార్ ఏమి చేసినా ప్రేక్షకులును మెప్పించాడు. తీసిన ప్రతీ సినిమాలోనూ తనదంటూ మార్క్ వేసాడు. ప్రతీ పాత్రా ఒక ప్రయోగమే. ఇప్పుడు తెలుగులో రాబోతున్న కేసీఆర్ బయోపిక్ లో తెలంగాణా ముఖ్యమంత్రి గా కనిపించబోతున్నది కూడా ఇతనే.

కిక్ అనిపించదు

కిక్ అనిపించదు

చేసే ప్రతీ పాత్రలోనూ నాదంటూ ఒక మార్క్ పడక పోతే కిక్ అనిపించదు అనే రాజ్ కుమార్ రావ్ సినిమాల కోసమే కాదు చిన్న వెబ్ సిరీస్ లకోసం కూడా అంతే కష్టపడుతున్నాడు. గతం లో ఉడాన్ సినిమా డైరెక్టర్ విక్రమాదిత్య మొత్వానే డైరెక్ట్ చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘ట్రాప్పెడ్' సినిమా కోసం పక్కటెముకలు కనిపించేలా సన్న బడి ఆరోగ్యం కూడా లెక్కచేయకుండా చిక్కిపోయి అందర్నీ ఆశ్చర్య పరిచాడు.

''బోస్'' అనే వెబ్ సిరీస్ కోసం

''బోస్'' అనే వెబ్ సిరీస్ కోసం

ఇప్పుడు మళ్ళీ హాన్సల్ మెహతా డైరెక్ట్ చేయబోతున్న ''బోస్'' అనే వెబ్ సిరీస్ కోసం బాగ బరువు పెరిగాడు. ఒక సినిమా కోసం అంటే ఏమో అనుకోవచ్చు గానీ కేవలం వెబ్ సిరీస్ కోసం భారీగా పొట్ట పెంచేసి ఇలా తయారయ్యాడు. ఇదె అనుకుంటే ఇదే వెబ్ సిరీస్లో రాజ్ కుమార్ రావు సగం బట్టతల ఉండే పూర్తి డీగ్లామరైజ్ రోల్ లో కనిపించనున్నాడు.

షాక్ అయ్యారు

షాక్ అయ్యారు

సుమారుగా 11 కేజి లు పెరిగిన రాజ్ కుమార్ రావు ఫోటోని చూసి అందరూ షాక్ అయ్యారు. ట్రాప్పెడ్ సినిమాలో బక్క చిక్కి.. బెహెన్ హోగి తేరి సినిమాలో కండలు పెంచి ఫిట్ గా కనిపించి.. మళ్ళీ ఇప్పుడు బోస్ వెబ్ సిరీస్ కోసం ఇలా పెంచి ఆ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసాడు...

సంతృప్తి దక్కుతుంది

సంతృప్తి దక్కుతుంది

"నేను సాధరణంగా తిన్నదాన్ని కన్నా పది రేట్లు ఎక్కువగా తిన్నాను. ఒక పాత్ర కోసం పనిచేసేటప్పుడు నాకు చాల సంతృప్తి దక్కుతుంది. తెర పైన ఆ పాత్రను ఎంత బాగ చేస్తే పాత్ర మరింత గొప్పగా కనిపిస్తుందో ఆలోచించి దాన్ని కోసం వంద శాతం శ్రామిస్తాను అని చెప్పాడు" అన్నాడు. తాము చేయబోయే పాత్రకోసం ఎంతకైనా శ్రమించటం ఇప్పటి స్టార్లలో కనిపిస్తున్న గొప్ప గుణం అనే చెప్పాలి...

English summary
"Building a character. Nothing gives me more high than the process of exploring someone else's life on screen," Rajkumar Rao tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu