»   » తిరుమలలో రజనీ ఫ్యాన్స్ అత్యుత్సాహం,వివాదం(ఫొటోలు)

తిరుమలలో రజనీ ఫ్యాన్స్ అత్యుత్సాహం,వివాదం(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

తిరుమల : రజనీకాంత్‌ ఛాయా చిత్రం ముద్రించిన బ్యానర్‌ను ప్రదర్శిస్తూ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఆయన అభిమానులు బుధవారం అత్యుత్సాహం ప్రదర్శించటం ఇప్పుడు వివాదం గా మారింది. రజనీ తాజా చిత్రం ఘన విజయం సాధించాలని, ఆరోగ్యంగా ఉంటూ మరిన్ని చిత్రాల్లో నటించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ అభిమానులు తలనీలాలు సమర్పించుకుని శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

తిరుమలకు వచ్చే భక్తులు గోవింద నామస్మరణ చేయడం, స్వామివారి చిత్ర పటాన్ని ప్రదర్శించడం లాంటి చర్యలు మినహా ఇతరత్రా వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన ప్రచారాలు చేయరాదనే నిబంధన ఉంది.

రజనీకాంత్‌ తాజా చిత్రం 'కొచ్చాడియన్‌' విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన అభిమానులు 300 మంది బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని కాలినడకన తిరుమలకు తరలివచ్చారు. ఈ విషయాన్ని స్వామి వారి భక్తులు తప్పు పడుతున్నారు. దేవస్ధానం వారు చర్య తీసుకోక పోవటాన్ని నిరసిస్తున్నారు.

మిగతా విషయాలు..స్లైడ్ షోలో..

నిబంధనలకు వ్యతిరేకం..

నిబంధనలకు వ్యతిరేకం..

ఇలా నిబంధనలకు వ్యతిరేకంగా తిరుమలకు వస్తున్నా తితిదే సిబ్బంది అవగాహన కల్పించి బ్యానర్లను ప్రదర్శించకుండా చర్యలు తీసుకోలేదు.

పూర్తి వివరాల్లోకి వెళితే....

పూర్తి వివరాల్లోకి వెళితే....

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న త్రీడీ యానిమేషన్‌ చిత్రం 'కొచ్చడియాన్‌' విజయవంతం కావాలని అభిమానులు పాదయాత్రగా తిరుమలకు బయలు దేరారు. బుధవారం తమిళనాడు వేలూరు సమీపంలోని సోలింగర్‌ నుంచి జిల్లా రజినీకాంత్‌ అభిమానుల సంఘం కోశాధికారి రవి ఆధ్వర్యంలో మూడు వందల మంది తరలి వచ్చారు.

ర్యాలీ తో

ర్యాలీ తో

తిరుపతి రిలయన్స్‌ మార్ట్‌ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండు, విష్ణునివాసం మీదుగా తిలక్‌రోడ్డు, వి.వి.మహల్‌రోడ్డు, కె.టి.రోడ్డు, హరేరామ హరేకృష్ణ రోడ్డు మీదుగా అలిపిరి చేరుకున్నారు.

టెంకాయలు...

టెంకాయలు...

అలిపిరి పాదాల మండపం వద్ద రజినీకాంత్‌ 156వ చిత్రం కావడంతో అన్ని టెంకాయలను కొట్టారు. అనంతరం రజినీకాంత్‌ ఆరోగ్యంగా ఉండాలని, మరెన్నో చిత్రాల్లో ఆయన నటించాలని శ్రీవారిని మొక్కుకున్నట్లు తెలిపారు.

అభిమాన సంఘం అధ్యక్ష్యుడు రవి మాట్లాడుతూ...

అభిమాన సంఘం అధ్యక్ష్యుడు రవి మాట్లాడుతూ...

తమిళంలో కొచ్చడియాన్‌, తెలుగులో విక్రమసింహగా ఈ నెలలో అభిమానుల ముందుకు రానున్న రజినీకాంత్‌ త్రీడీ చిత్రం విజయవంతం కావాలని ఏడుకొండల వాడికి వేడుకునేందుకు వచ్చినట్లు వివరించారు.

సామాజిక సేవ సైతం...

సామాజిక సేవ సైతం...

ఈ ర్యాలీలో ఓటు హక్కు ప్రాధాన్యాన్ని వివరిస్తూ కరపత్రాలను పంచిపెట్టారు. పొగాకు వాడకం ప్రాణాంతకమని తెలియజేస్తూ తిరునగరంలో ర్యాలీగా ముందుకు సాగారు.

English summary
A troop of die-hard Rajni fans from Tamil Nadu embark on Tirumala trek seeking divine intervention for the ‘Kochadaiyaan’ movie’s success.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu