For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆర్ నారాయణ మూర్తి ‘రాజ్యాధికారం’(డిస్క్ ఫంక్షన్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: స్నేహచిత్ర పిక్చర్స్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఆర్‌. నారాయణమూర్తి నిర్మిస్తున్న 27వ చిత్రం ‘రాజ్యాధికారం'. ఇందులో ఆయన తండ్రి, ముగ్గురు కొడుకులుగా.. మొత్తం నాలుగు పాత్రలు పోషించడం విశేషం. నిర్మాణ పనులు పూర్తయిన ఈ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

  ఈ చిత్రానికి సంబంధించిన పాటలకు మంచి స్పందన రావడంతో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరిపారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, ప్రజాగాయకుడు గద్దర్, జెకె భారవి, ప్రజాకవులు కమటం రామస్వామి, జయరాజు, గిద్దె రామనర్సయ్య, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

  రాఘవేంద్రరావు మాట్లాడుతూ...మేమంతా ఏసీ రూముల్లో కూర్చొని కథలు రెడీ చేస్తుంటాం. కానీ నారాయణమూర్తి ఎర్రటి ఎండలో రోడ్డుమీద నడుస్తూ కనిపిస్తాడు. ఎర్రజెండా ఉన్నంతకాలం ఆయన అందరికీ గుర్తుంటాడు అని తెలిపారు. గద్దర్ మాట్లాడుతూ...నారాయణ మూర్తి గత 30 సంవత్సరాలుగా తాను నమ్మిన సిద్ధాంతం కోసమే సినిమాలు తీస్తూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాధికారం రాజకీయ నేపథ్యంలో వస్తున్న సినిమా. అందరికీ నచ్చుతుంది. ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని తీయాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

  రాజ్యాధికారం

  రాజ్యాధికారం

  ‘‘దళితులను, పేదలను పీక్కుతినే భూస్వాములు, పెత్తందార్లపై రామయ్య అనే పేద దళిత రైతు చేసిన తిరుగుబాటు ఈ చిత్రం. ఆయన ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు చిన్నప్పుడే తప్పిపోయి, ఒకతను ముస్లిం కుటుంబంలో పెరిగితే, మరొకతను ఉద్యమకారుడిగా ఎదుగుతాడు. అమాయకుడైన ఇంకో కొడుకు తండ్రి దగ్గరే పెరుగుతాడు. నేడు సమాజంలో జరుగుతున్న వాస్తవిక అంశాలను తీసుకొని, ‘రాజ్యాధికారం' కోసం పెత్తందారులు చేసే అరాచకాలు ఎలా ఉంటున్నాయో, ఆ అరాచకాలకు సామాన్యులు ఎలా బలవుతున్నారో ఈ చిత్రంలో చూపించానని నారాయణ మూర్తి తెలిపారు.

  షూటింగ్

  షూటింగ్

  ఖమ్మంలోని కొత్తగూడెం, పాల్వంచ, పాండురంగాపురం, సీతారామపట్నం, భద్రాచలం ప్రాంతాల్లో, తూర్పుగోదావరి జిల్లాలోని నాయకంపల్లి, కాట్రావులపల్లి గ్రామాల్లో, శ్రీకాకుళంలోని లక్ష్మింపేటలో చిత్రీకరణ జరిపాం. ఇటీవల విడుదల చేసిన పాటలు మంచి ఆదరణ పొందాయి.

  నటీనటులు

  నటీనటులు

  తనికెళ్ల భరణి (ద్విపాత్రలు), ఎల్బీ శ్రీరామ్‌, తెలంగాణ శకుంతల, పద్మావతీ నాయక్‌, అమరేంద్ర, కె.బి. ఆనంద్‌, రాంబాబు, వీరభద్రం, సైదులు, అయూబ్‌ తదితరులు నటించారు.

  తెర వెనక

  తెర వెనక

  ఈ చిత్రానికి పాటలు: వంగపండు ప్రసాదరావు, గోరటి వెంకన్న, జయరాజ్‌, వరంగల్‌ శ్రీనివాస్‌, దయానర్సింగ్‌, గిద్దే రామనర్సయ్య, కమటం రామస్వామి, నేపథ్యగానం: వందేమాతరం శ్రీనివాస్‌, కమటం రామస్వామి, కథ, చిత్రానువాదం, మాటలు, ఛాయాగ్రహణం, కూర్పు, సంగీతం, నిర్మాణం, దర్శకత్వం: ఆర్‌. నారాయణమూర్తి.

  English summary
  Rajyadhikaram Movie Platinum Disc event held in Hyderabad.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X