»   » సన్నీ లియోన్ ను దేశం నుంచి పారిపోయేలా చేస్తా

సన్నీ లియోన్ ను దేశం నుంచి పారిపోయేలా చేస్తా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : ఐటమ్ బాంబ్ రాఖీ సావంత్ కు ఏమైందో ఏమో కానీ... పూర్తి స్ధాయిలో శృంగార తార సన్నీ లియోన్ పై విరుచుకుపడటంలో బిజీగా ఉంటోంది. రెండు రోజుల క్రితమే .. సన్నీతో తనకు పోలికేంటని అన్న రాఖీ ...అంతటితో ఆగకుండా.. సన్నీని దేశం నుంచి పారిపోయేలా చేస్తానని ఆవేశంతో ఊగిపోతోంది. వివాదాస్పద కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే రాఖీ తాజాగా సన్నీ మీద ఫైర్ అవ్వడంపై పబ్లిసిటీ స్టంటా లేక మరేదైనా కారణమా అనేది అర్దం కావటం లేదు. అయితే సన్నిలియోన్ తన ఆఫర్స్ అన్నీ లాగేసుకుంటోందని, వరుస అవకాశాలతో సన్నీ బాలీవుడ్ ను ఎదిగిపోవటమే రాఖీ కోపం కు కారణమని అంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సన్నీ లియోని... ప్రస్తుతం వెండితెరపై హాట్‌ హాట్‌ అందం. యువతరంలో క్రేజ్‌ ఉన్న కథానాయిక. తక్కువ కాలంలోనే చిత్ర సీమలో ఈమె పేరు మార్మోగిపోయింది. నాయిక పాత్రలతో పాటు ఐటమ్‌ పాటలకు సై అంటోంది. ఇంత ఫాలోయింగ్‌ ఉన్న సన్నీని ఇట్టే తీసి పారేసింది రాఖీసావంత్‌. ఒకప్పుడు హుషారెత్తించే ఐటమ్‌ పాటలతో బాలీవుడ్‌ను వేడిక్కించిన అందాల భామ రాఖీ సావంత్‌.

Rakhi Sawant wants to throw Sunny Leone outside India

కొత్త అందాలు తెరకు రావడంతో ఈ మధ్య ఈమెకు అవకాశాలే లేవనే చెప్పాలి. మళ్లీ ఓ ఐటమ్‌ పాటతో త్వరలో ప్రేక్షకులముందుకు రాబోతుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో దూసుకుపోతున్న సన్నీ లియోనికి ఈ పాటతో గట్టి పోటీనిస్తారా? అని ఓ మీడియా ప్రతినిధి రాఖీని అడిగాడట. వెంటనే రాఖీ కోపంతో ఓ పోర్న్‌స్టార్‌తో నన్ను పోలుస్తారేంటి? అని బహిరంగంగానే అనేసిందట.

''పాటలతో, డ్యాన్స్‌తో ఎప్పుడో నేనేంటో నిరూపించుకున్నాను. అభిమానుల హృదయాల్ని గెలుచుకున్నాను. పెద్దలు మాత్రమే చూసే చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకోలేదు''అని చెప్పింది. అంతేకాదు తనను ఎవరితో పోలిస్తే బాగుంటుందో కూడా చెప్పేసింది. ''నా అందం ఇప్పటికీ తగ్గలేదు. అయినా నన్ను ఏ జెన్నిఫర్‌ లోపేజ్‌తోనో, మడోన్నాతో పోలిస్తే బాగుండేది''అని చెప్పింది.

ఇక ప్రస్తుతం దక్షిణ, ఉత్తరాది భాషల్లో గ్లామరస్ రోల్స్ చేస్తున్న సన్నీ జీవితం ఆధారంగా ఓ డాక్యుమెంటరీ రూపొందింది. సన్నీ అంటే.. కేవలం నీలి చిత్రాల తార మాత్రమే కాదు.. ఆమె జీవితంలో అంతకు మించిన విషయాలు బోల్డన్ని ఉన్నాయట. వాటి సమాహారంతో ప్రముఖ దర్శకురాలు దీపా మెహతా సోదరుడు దిలీప్ మెహతా ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. ఈ విషయాన్ని స్వయంగా సన్నీ భర్త డానియెల్ పేర్కొన్నారు.

సన్నీ జీవితంలోకి డానియెల్ రాకముందు.. అతనొచ్చిన తర్వాత సంఘటనల సమాహారంతో ఈ చిత్రం ఉంటుంది. సన్నీ, డానియెల్ పాల్గొనగా 18 నెలల పాటు చిత్రీకరణ జరిపారు. ప్రస్తుతం ఈ చిత్రం ఎడిటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది జరగనున్న 'సన్‌డాన్స్ ఫిలిం ఫెస్టివల్'లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఇండో-కెనడియన్ శృంగారతార సన్నీ లియోన్..యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, అందాల భామ దీపికా పదుకోన్ లను వెనక్కునెట్టి సన్నీ నెటిజన్లను ఆకర్షిస్తోంది. 2015 మొదటి మూడు నెలలో విడుదలైన బాలీవుడ్ చిత్రాలన్నింటి కంటే సన్నీ తాజా హిందీ చిత్రం 'ఏక్ పహేలి లీలా' ట్రైలర్ ను యూ ట్యూబ్ లో అత్యధికమంది వీక్షించారు.

రెండు నెలల క్రితం విడుదలైన 'ఏక్ పహేలి లీలా' ట్రైలర్ ను ఇప్పటి దాకా కోటిమందికిపైగా వీక్షించారు. గుల్షన్ దేవయ్య, రాధికా ఆప్టే నటించి 'హంటర్' రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో రాధికా ఆప్టే చిత్రం 'బాంబే వెల్వెట్', అమితాబ్, ధనుష్ ల చిత్రం 'షమితాబ్' ట్రైలర్లు ఉన్నాయి.

English summary
Bollywood’s controversy queen Rakhi Sawant who is popular for her blunt remarks, recently targeted actress Sunny Leone. Rakhi said...if she gets a chance then she would throw Sunny out of India.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu