»   » దయ్యాన్ని రక్షించిన దేవుడు.. దిమ్మతిరిగేలా 'ర‌క్ష‌క‌భ‌టుడు’ హిందీ రీమేక్ రైట్స్

దయ్యాన్ని రక్షించిన దేవుడు.. దిమ్మతిరిగేలా 'ర‌క్ష‌క‌భ‌టుడు’ హిందీ రీమేక్ రైట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఫస్ట్‌లుక్‌తోనే ఆకట్టుకొన్న రక్షకభటుడు విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తున్నది. తాజాగా ఈ చిత్ర హిందీ హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయని నిర్మాత ఏ గురురాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని నిర్మాత వెల్లడించారు.

 కంటెంట్‌నే హీరోగా నమ్మి..

కంటెంట్‌నే హీరోగా నమ్మి..

ర‌క్ష‌, జ‌క్క‌న్న లాంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ సినిమాకు డైరెక్టర్. సుఖీభ‌వ మూవీస్ బ్యాన‌ర్‌పై ఏ గురురాజ్ నిర్మిస్తున్నారు. ‘ర‌క్ష‌క‌భ‌టుడు' చిత్రానికి సంబంధించిన మ‌రో విష‌య‌మేమంటే ఈ సినిమాలో పెద్ద స్టార్ హీరో లెవ‌రూ లేక‌పోవ‌డ‌ం. కంటెంట్‌నే హీరోగా పెట్టి ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ సినిమాను రూపొందించారు.

కథ ఏంటంటే..

కథ ఏంటంటే..

సాధార‌ణంగా దేవుడంటే దెయ్యాలు భ‌య‌ప‌డుతుంటాయి. కానీ ఓ దెయ్యాన్ని దేవుడే కాపాడ‌టం ఈ సినిమాలో డిఫ‌రెంట్ పాయింట్‌. ఈ సినిమాను అర‌కు లోయ‌ నేపథ్యంగా తెరకెక్కించారు. తొలి సన్నివేశం నుంచి చివరి సీన్ వ‌ర‌కు ఎంట‌ర్‌టైన్మెంట్ ప్ర‌ధానంగా ఈ సినిమా సాగుతుంది.

ఆంజ‌నేయ స్వామి పోలీస్ గెట‌ప్

ఆంజ‌నేయ స్వామి పోలీస్ గెట‌ప్

ప్ర‌తి క్యారెక్ట‌ర్‌లో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆర్ట్ డైరెక్ట‌ర్ రాజీవ్ నాయ‌ర్ వేసిన పోలీస్ స్టేష‌న్ సెట్‌లోనే సినిమా 90 శాతం చిత్రీక‌ర‌ణ సాగింది. మ‌ల్హ‌ర్ భ‌ట్ జోషి, శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్ సినిమాను హైలైట్ అంశాలుగా నిలుస్తాయి. రీసెంట్‌గా విడుద‌ల చేసిన డిజిట‌ల్ టీజ‌ర్‌కు ఆడియెన్స్ నుండి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. అంత‌కు ముందుగా ఆంజ‌నేయ స్వామి పోలీస్ గెట‌ప్ వేసుకున్న డిజిట‌ల్ పోస్ట‌ర్‌ను ఇటీవల విడుద‌ల చేశాం అని నిర్మాత గురురాజ్ పేర్కొన్నారు.

 ఫస్ట్‌లుక్‌కు సూపర్బ్ రెస్పాన్స్

ఫస్ట్‌లుక్‌కు సూపర్బ్ రెస్పాన్స్

వినూత్నంగా రూపొందించిన పోస్ట‌ర్‌కు కూడా సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఆంజ‌నేయ‌స్వామి పోలీస్ గెట‌ప్ వేసుకోవ‌డ‌మేంటి అనే క్యూరియాసిటీ ప్రేక్ష‌కుల్లో, ట్రేడ్ వ‌ర్గాల్లో ఏర్ప‌డింది. హీరో ఎవ‌రో చెప్ప‌కున్నా, కాన్సెప్ట్‌పై న‌మ్మ‌కంతో సినిమా హిందీ అనువాద హ‌క్కుల‌ను ఫ్యాన్సీ ఆఫ‌ర్‌తో కోనుగోలు చేయ‌డం విశేషం గురురాజ్ తెలిపారు.

ఆసక్తికరంగా..

ఆసక్తికరంగా..

రిచాప‌నై, బ్ర‌హ్మానందం, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, బ్ర‌హ్మాజీ, సుప్రీత్‌(కాట్రాజు) త‌దిత‌రులు న‌టించారు. థ్రిల్లింగ్ ఎంట‌ర్‌టైన్మెంట్‌తో మంచి ఎమోష‌న్స్‌ను యాడ్ చేసి ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ సినిమాను ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా మ‌లిచారు.

English summary
Rakshakabhatudu movie creating sensation before release itself. This movie hindi remake rights sold for fancy rate. This suspense thriller produced by A Gururaj. Director is Vamshi Akella.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu