»   » కాటమరాయుడు, బాహుబలితో అమీతుమీ.. ఎవరీ రక్షకభటుడు?

కాటమరాయుడు, బాహుబలితో అమీతుమీ.. ఎవరీ రక్షకభటుడు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పెద్ద హీరోల సినిమాలు, క్రేజీ ప్రాజెక్టు విడుదల అవుతుంటే చిన్న సినిమాలు రిలీజ్ వాయిదా పడటం సినీ పరిశ్రమలో చాలా సహజం. పెద్ద చిత్రాల నడుమ చిన్న సినిమా వేస్తే నలిగిపోతాయని ఫిల్మ్ మేకర్స్ భయపడుతుంటారు. ప్రస్తుతం నెల రోజుల వ్యవధిలోనే టాలీవుడ్‌లో రెండు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

రక్షకభటుడు సాహసం

రక్షకభటుడు సాహసం

ఆ చిత్రాలు ఎలాంటివి అంటే సునామీ లాంటి కాటమరాయుడు, బాహుబలి ది కన్‌క్లూజన్. ఇలాంటి సినిమాల విడుదలకు ముందు వారం రోజుల ముందుగానీ, వారం తర్వాత గానీ ఓ మోస్తారు రేంజ్ సినిమాను విడుదల చేయడానికి జంకుతుంటారు. కానీ ఈ రెండు చిత్రాలను ఢీకొనేందుకు ఓ చిన్న సినిమా నిర్మాతలు భారీ సాహసానికి పూనుకొన్నారు. ఆ చిత్రమేమిటంటే రక్షకభటుడు.

ఇంతకీ హీరో ఎవరు..

ఇంతకీ హీరో ఎవరు..

రక్షకభటుడు చిత్రంలో హీరో ఎవరంటే ఎవరికీ తెలియదు. హీరో పేరు ఎక్కడా బయటపడకుండా నిర్మాతలు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా ఆసక్తిని రేపేలా ఉంది. హీరో తల స్థానంలో హనుమంతుడి చిత్రాన్ని ఉంచారు. భుజాన గద పెట్టుకొన్న ఫొటోను పోలీసు పాత్రను పోస్టర్‌పై ఉంచారు. దీంతో ఈ రక్షక భటుడు ఎవరు అనే సందేహం అందరిలో మొదలైంది.

కొత్త తరహాలో ప్రమోషన్

కొత్త తరహాలో ప్రమోషన్

ఏ నిర్మాత అయినా సాధారణంగా హీరో ముఖాన్ని చూపించి సినిమాను మార్కెట్ చేసుకొంటారు. రక్షకభటుడు నిర్మాత ఏ గురురాజ్ మాత్రం హీరోను చూపించకుండానే కొత్త తరహాలో ప్రమోషన్ మొదలుపెట్టాడు. ఈ స్ట్రాటజీ వెనుక బలమైన కారణం ఆయన నమ్ముకున్న కథే. కథ మీద ఉన్న భారీ నమ్మకంతో ఈ సాహసానికి పూనుకొన్నట్టు తెలుస్తున్నది.

నటీనటులు వీరే..

నటీనటులు వీరే..

రక్షకభటుడు చిత్రంలో రిచా పనాయ్, బ్రహ్మానందం, బాహుబలి ప్రభాకర్, బ్రహ్మజీ, సుప్రీత్ (కాట్రాజు), నందు, అదుర్స్ రఘు, చిత్రం శ్రీను, సత్తెన్న, జ్యోతి, గౌతంరాజు, రాంజగన్ తదితరులు నటించారు. మల్హార్ భట్ సినిమాటోగ్రఫీ, శేఖర్ చంద్ర సంగీతం, రాజీవ్ నాయర్ కళ, అమర్‌రెడ్డి ఎడిటింగ్, డ్రాగన్ ప్రకాశ్ ఫైట్స్ బాధ్యతలు నిర్వహించారు. ఏ గురురాజ్ నిర్వహణ సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంతోపాటు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు.

English summary
Small budget movie Rakshakabhatudu's first look creating a buzz. This movie ready to fight with Katamarayudu, Baahubali2. Film makers designed new strategy to promote the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu