»   » పవన్ కు రకుల్ ..పుట్టిన రోజు విషెష్

పవన్ కు రకుల్ ..పుట్టిన రోజు విషెష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ రోజు పవన్ పుట్టిన రోజు సందర్బంగా సన్నిహితులు,మిత్రులు, అబిమానులే కాకుండా ఇండస్ట్రీ వర్గాలు సైతం శుభాకాంక్షలు భారీ ఎత్తున తెలియచేస్తున్నారు. తమకు అందుబాటులో ఉన్న ట్విట్టర్ ద్వారా విషెష్ తెలియచేసారు. తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ మీరూ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రామ్ 'పండగచేస్కో', రవితేజ 'కిక్-2', బాలీవుడ్ మూవీ 'శిమ్లా మిర్చి' చిత్రాల్లో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్... రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలలో షూటింగ్ లో పాల్గొంటోంది. మిగతా చిత్రాల షూటింగ్ పూర్తి కావస్తున్నప్పటికీ రామ్ చరణ్ సినిమా మాత్రం ఇటీవలే పూర్తైంది. ఎన్టీఆర్ సినిమా ఎక్కువభాగం లండన్ లో చిత్రీకరణ జరుపుకోనుంది.

రకుల్ ప్రీత్ సింగ్.. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లా దూసుకుపోతూ... కరెంట్ తీగలాంటి షాక్ లతో... కుర్రకారును తన అందాలతో కిర్రెక్కిస్తోంది. లౌక్యంగా కెరీర్ కొనసాగిస్తున్న ఈ బ్యూటీ... పండగచేస్కో సినిమాలో నటించడం మాటేమోకానీ... స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ.... కెరీర్ విషయంలోనూ నిజంగానే పండగచేస్కోంటోంది.

Rakul birthday wishes to Pawan Kalyan

రవితేజతో నటిస్తున్న కిక్-2 విడుదల కాకముందే.. రామ్ చరణ్ సినిమాలో అవకాశం అందుకున్న రకుల్... మరోవైపు మహేశ్ సినిమాతో పాటు ఎన్టీఆర్-సుకుమార్ సినిమాలోనూ ఛాన్స్ అందుకుంది. సో.. ప్రస్తుతం రకుల్ ఖాతాలో నలుగురు స్టార్ హీరోల సినిమాలున్నాయన్నమాట.

ఎన్టీఆర్ తర్వాతి సినిమా సుకుమార్ దర్శకత్వంలో ఉండబోతోంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని, హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ తయారు చేసుకున్న కథ ప్రకారం సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. ఇందుకోసం హన్సిక, రకుల్ ప్రీత్ సింగ్‌లను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

వీరిద్దరిలో ఎవరైనా హాండిస్తే రాశి ఖన్నాను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలస్తోంది. త్వరలోనే ఆ విషయం అనేది ఫైనలైజ్ కానుంది. ఈ చిత్రాన్ని ‘అత్తారింటికి దారేది' నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ చిత్రానికి పని చేయబోతుండటం విశేషం.

English summary
Rakul Preet Singh tweeted "A very happy bday to d one n only powerstar #Pawankalyan garu!!! ," she wrote.
Please Wait while comments are loading...