»   » తెర వెనుక కధేంటి ?: 'కోటి మ్యాటర్' గురించి రకుల్ ప్రీతి సింగ్

తెర వెనుక కధేంటి ?: 'కోటి మ్యాటర్' గురించి రకుల్ ప్రీతి సింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :"నా పారితోషికం విషయంలో మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను ...హీరోలతో సమానంగా హీరోయిన్స్ కు కూడా రెమ్యునేషన్ ఇవ్వాలని ఫీలవుతాను. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే...ఓ హీరో ఓ చిత్రం ఫినిష్ చేసేటప్పటికి ...హీరోయిన్స్ మి అయిన మేము మూడు సినిమాలు పూర్తి చేస్తాము..కాబట్టి నాకు ఏదైతే రెమ్యునేషన్ వస్తోందో...దాంతో హ్యాపీ ", అంటూ తేల్చి చెప్పింది రకుల్ ప్రీతి సింగ్.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

గత కొద్దిరోజులుగా మీడియాలో రకుల్ ప్రీతి సింగ్...కోటి రూపాయల రెమ్యునేషన్ డిమాండ్ చేస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె ఆ కోటి ప్రసక్తి ఎత్తకుంటా ఇలా లాజిక్ తో ఆ మ్యాటర్ రూమర్ అని కొట్టిపారేసింది. మొన్న 'చిన్నదాన నీకోసం' సినిమాతో భారీ ప్లాప్ ను మూట గట్టుకున్న నితిన్... తన తదుపరి చిత్రంలో నటించడానికి రకుల్ కు కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఆఫర్ చేశాడనే వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.

అయితే...గతంలోనే నితిన్ కు సంబంధించిన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ లో ఓ సినిమాకు రకుల్ సైన్ చేసింది. అప్పుడా సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఆ డేట్స్ ను నితిన్ ఇప్పుడు అడుగుతున్నాడని కొందరంటుంటే... తన దగ్గర డేట్స్ ఖాళీ లేవు కాబట్టి... కోటి రూపాయలను రకుల్ డిమాండ్ చేస్తోందని చెప్పుకుంటున్నారు.

సక్సెస్ ఫుల్ హీరోయిన్

సక్సెస్ ఫుల్ హీరోయిన్

మోడలింగ్ నుండి సినిమాల్లోకి వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనే ప్రచారం టాలీవుడ్ లో సూపర్ గా జరుగుతోంది.

ఐదింటిలో...

ఐదింటిలో...

రకుల్ నటించిన తెలుగు సినిమాలు ఇంతవరకూ ఐదు విడుదలైతే... 'కెరటం', 'రఫ్' చిత్రాలు పరాజయం పాలు కాగా, 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్', 'లౌక్యం' హిట్ అయ్యాయి. 'కరెంట్ తీగ' పైసా వసూల్ మూవీగా నిలిచింది.

త్వరలో...

త్వరలో...

రకుల్ ప్రీత్ సింగ్ నటించిన 'పండగ చేస్కో', 'కిక్ -2' సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

మూడూ పెద్ద ఆఫర్సే..

మూడూ పెద్ద ఆఫర్సే..

ఇక రామ్ చరణ్ 'మై నేమ్ ఈజ్ రాజు'లోనూ, ఎన్టీయార్ 'నాన్నకు ప్రేమతో' మూవీలోనూ రకుల్ నటించబోతోంది. అలానే మహేశ్ బాబు 'బ్రహ్మోత్సవం'లోనూ తానున్నానని రకుల్ స్పష్టం చేసింది.

రెమ్యునేషన్ కారణం

రెమ్యునేషన్ కారణం

రకుల్ కు వరుసగా అవకాశాలు రావడం వెనుక ఆమె పారితోషికం సమంజసంగా ఉండటమూ ఓ కారణమని అంటారు.

సమంత ఛాన్స్ ని...

సమంత ఛాన్స్ ని...

రామ్ చరణ్ - శ్రీనువైట్ల మూవీతో పాటు మహేశ్ అప్ కమింగ్ సినిమాలోనూ సమంత అవకాశాన్ని ఎగరేసుకుపోయింది రకుల్...ఇంతలా మిగతా హీరోయిన్ల ఆఫర్లను ఎగరేసుకుపోతూ కూడా రకుల్ నైస్ గా తాను ఎవరికీ పోటీకాదని అంటోంది.

టైమొచ్చింది

టైమొచ్చింది

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో మంచి పేరు వచ్చినా.. కొన్ని నెలల పాటు ఆఫర్లు లేకుండా ఖాళీగా ఉన్నానన్న రకుల్... ఇప్పుడు తనకు టైమ్ కలిసొచ్చిందని అభిప్రాయపడుతోందట.

నన్ను అనొద్దు

నన్ను అనొద్దు

రకుల్ మాట్లాడుతూ... "మీరేమైనా అనాలని అనుకుంటే విధిని అనండి తప్ప... నన్ను మాత్రం ఏమీ అనొద్దు" అంటూ తెలివిగా తప్పించుకుంటోంది.

రెమ్యునేషన్ ఎంత

రెమ్యునేషన్ ఎంత

ఆమె ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాకు అరవై లక్షలు తీసుకుంటోందని తెలుస్తోంది.

ప్రస్తుతం

ప్రస్తుతం

ఆమె స్విజ్జర్ లాండ్ లో రామ్ చరణ్, శ్రీను వైట్ల చిత్రం షూటింగ్ లో బిజీగ ఉంది. మే 29 దాకా షూటింగ్ జరుగుతుంది.

చాలా ఇబ్బంది

చాలా ఇబ్బంది

ఇప్పటి వరకు ఒప్పుకున్న అన్ని సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయడంలో రకుల్ ప్రీత్ ఇబ్బంది పడుతోంది.

సెలక్టివ్ గా...

సెలక్టివ్ గా...

దాంతో రకుల్ ప్రీత్ ప్రస్తుతం వస్తున్న ఆఫర్స్ లో స్క్రిప్ట్స్ విని చాలా సెలక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటోంది.

గోల్డెన్ లెగ్...

గోల్డెన్ లెగ్...

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్', ‘లౌక్యం' మరియు ‘కరెంట్ తీగ' సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకొని గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది

అందుకే పెంచింది

అందుకే పెంచింది

నితిన్ సినిమాకు ఆమె డేట్స్ కేటాయించగలిగితే... ఏకంగా కోటి రూపాయలు పారితోషికంగా అందే అవకాశం ఉందట.

నలుగురుతో...

నలుగురుతో...

రవితేజతో నటిస్తున్న కిక్-2 విడుదల కాకముందే.. రామ్ చరణ్ సినిమాలో అవకాశం అందుకున్న రకుల్... మరోవైపు మహేశ్ సినిమాతో పాటు ఎన్టీఆర్-సుకుమార్ సినిమాలోనూ ఛాన్స్ అందుకుంది. సో.. ప్రస్తుతం రకుల్ ఖాతాలో నలుగురు స్టార్ హీరోల సినిమాలున్నాయన్నమాట.

English summary
“There is no truth in the remuneration movies. I sincerely believe that hero and heroines should have equal pay. But seriously if a hero completes one movie, by that time we would finish 3 projects. So I”m happy with whatever I’m getting paid”, says Rakul.
Please Wait while comments are loading...