»   » ఫన్ వీడియో: రకుల్ ప్రీతి సింగ్, క్రితి సానన్ డంబాష్ ఛాలెంజ్

ఫన్ వీడియో: రకుల్ ప్రీతి సింగ్, క్రితి సానన్ డంబాష్ ఛాలెంజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: డంబాష్ వీడియోలు అంటే అందరికీ సరదానే. ముఖ్యంగా యూత్ కు ఈ డంబాష్ వీడియోలంటే ఉన్న క్రేజ్ ని గమనించి ఎప్పుడూ యూత్ పల్స్ పట్టుకునే సుకుమార్ ఓ ఛాలెంజ్ ని పెట్టారు. తను నిర్మిస్తున్న కుమారి 21 ఎఫ్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా డంబాష్ ఛాలెంజ్ ని పెట్టారు. ఆ ఛాలెంజ్ విషయాన్ని జనాలకు తెలియచేయటానికి ఇదిగో తన హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ చేత డంబాష్ చెప్పించి ఆ వీడియోని వదిలారు. మీరు చూడండి...ఇక్కడ.

క్రితి సానన్ వీడియో

సుకుమార్ నిర్మాతగా ‘కుమారి 21 ఎఫ్' పేరుతో ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తూ సూర్య ప్రతాప్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హేభా పటేల్ కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా.. ప్రముఖ కెమెరామెన్ రత్నవేలు ఈ చిత్రానికి ఫోటోగ్రఫీని అందిస్తున్నారు.

ఈ చిత్రం ఆడియో వేడుకను ఈనెల 31న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆడియోను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.

Rakul Preet and kriti sanon Dubsmash - Kumari 21F

సుకుమార్ రైటింగ్స్, అండ్ పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ను ఇటీవలే పూర్తిచేసుకుని నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది.

రాజ్‌తరుణ్, హేభ పటేల్, నోయల్, నవీన్, సుదర్శన్ రెడ్డి, భాను, హేమ, కమల్, తాగుబోతు రమేష్, జోగిబ్రదర్స్, సత్య కృష్ణ, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్, ఎడిటర్: అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, శంకర్, నిక్సన్, సమర్పణ: సుకుమార్, నిర్మాతలు: విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి,కథస్కీన్‌ప్లే-మాటలు: సుకుమార్, దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్.

English summary
Checkout the video of Rakul Preet and kriti sanon Dubsmash as a part of Kumari 21F The Dubsmash Challenge.
Please Wait while comments are loading...