»   » సినీ ఇండస్ట్రీలోకి రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్... ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్!

సినీ ఇండస్ట్రీలోకి రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్... ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మోడలింగ్ రంగం నుండి సినిమా రంగం వైపు అడుగులు వేసి హీరోయిన్‌గా సక్సెస్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశ్యంతో వివిధ వ్యాపారాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు... తాను ఇండస్ట్రీలో ఫాంలో ఉన్నపుడే తన సోదరుడిని కూడా సెట్ చేయాలని ప్లాన్ చేస్తోంది.

రకుల్ సోద‌రుడు అమ‌న్ రాక్ ఎన్ రోల్‌ అనే షార్ట్ ఫిలిం ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ విష‌యాన్ని ర‌కుల్ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది. ఆల్ ద బెస్ట్‌.. మై లిటిల్ బ్ర‌ద‌ర్‌.. ఇది నీకు మొద‌టి మెట్టే' అంటూ ట్వీట్ చేసింది.

ఇండస్ట్రీలోకి తెచ్చే ప్రయత్నం

ఇండస్ట్రీలోకి తెచ్చే ప్రయత్నం

రకుల్ ట్వీట్ చూస్తుంటే... అమన్‌ను ఇండస్ట్రీలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ షార్ట్ ఫిల్మ్ దర్శకులకు, నిర్మాతలకు చూపించి తన తమ్ముడి టాలెంటు గురించి వారికి చెప్పి అవకాశాలు ఇప్పించే ప్రయత్నం చేస్తుంది కాబోలు.

రాక్ ఎన్ రోల్

రాక్ ఎన్ రోల్

చందు హుగ్గిహెళ్ల దర్శకత్వంలో రూపొందిన రాక్ ఎన్ రోల్ అనే షార్ట్ ఫిలింలో అమన్ న‌టించాడు. త్వరలోనే ఈ షార్ట్ ఫిల్మ్ విడుదల కాబోతోంది.

హైదరాబాద్‌లో సెటిలైన రకుల్

హైదరాబాద్‌లో సెటిలైన రకుల్

తెలుగులో వరుస అవకాశాలు రావడంతో రకుల్ హైదరాబాద్లోనే సెటిలైంది. నార్త్ నుండి ఇక్కడికే మ‌కాం మార్చేసింది. సొంతిల్లు కూడా కొనుక్కుంది. జిమ్ వ్యాపారం కూడా మొద‌లుపెట్టింది.

కుటుంబ సభ్యులతో బిజినెస్

కుటుంబ సభ్యులతో బిజినెస్

సినిమాల ద్వారా తను సంపాదించిన డబ్బులను రకుల్ వ్యాపారాల్లో పెట్టుబడి పెడుతోంది. ఆ వ్యాపారాలను తన కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహిస్తోంది.

English summary
Rakul Preet Singh brother Aman is in trials to prove his talent. He has already acted in a short film with the title 'Rock N Roll' in the direction of Sridhar Huggihella. He is eager to show his talent in the film industry as well.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu