»   » సాయి పల్లవి, నివేదాను చూసి భయపడటం లేదు.. రకుల్‌.. నానీని కలిసి చెప్పాను..

సాయి పల్లవి, నివేదాను చూసి భయపడటం లేదు.. రకుల్‌.. నానీని కలిసి చెప్పాను..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లోనే కాదు.. తమిళ, హిందీ సినీ పరిశ్రమలో అవకాశాలను దక్కించుకొంటూ అగ్రతారగా మారింది రకుల్ ప్రీత్ సింగ్. వరుస విజయాలతో అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ దూసుకెళ్తున్నది. రకుల్ నటించిన తాజా చిత్రం జయ జానకి నాయక. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా ముచ్చటించింది. తాను నటిస్తున్న టాలీవుడ్, బాలీవుడ్, తమిళ చిత్రాల గురించి అందించి వివరాలు ఆమె మాటల్లోనే..

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు..

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు..

టాలీవుడ్ సినిమా ట్రెండ్ మారుతున్నదనే మాటను ఒప్పుకోను. హీరోయిన్ ఓరియెంట్ సినిమాలు వస్తున్నాయనే అంశాన్ని అంగీకరించను. ఎందుకంటే గతంలోనే శ్రీదేవి నటించిన క్షణక్షణం, జెనీలియా బొమ్మరిల్లు, త్రిష నటించిన నేను వస్తానంటే నేను వద్దంటానా? లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు కూడా హీరోయిన్ ఓరియెంట్ సినిమాలు రావడం మంచి పరిణామం.


టాలెంటెడ్ హీరోయిన్లతో మంచి కథలు..

టాలెంటెడ్ హీరోయిన్లతో మంచి కథలు..

నిన్ను కోరి చిత్రంతో నివేదా, ఫిదా సినిమాతో సాయి పల్లవికి మంచి క్రేజ్ రావడం చాలా సంతోషం. టాలెంట్ ఉన్న హీరోయిన్లు వస్తే మంచి కథలు వస్తాయి. మంచి సినిమాలను దర్శకులు రూపొందించడానికి అవకాశం ఉంటుంది. వారిని చూసి భయపడుతున్నానని వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఎవరి అవకాశాలు వారికి ఉంటాయి. ఎవరి పాత్రలు వారికి వస్తాయి.


నానిని కలిసి సక్సెస్ షేర్ చేసుకొన్నా..

నానిని కలిసి సక్సెస్ షేర్ చేసుకొన్నా..

నిన్ను కోరి సినిమా చూసిన తర్వాత నివేదా, నానీని కలిశాను. వారి సక్సెస్ నేను కూడా షేర్ చేసుకొన్నాను. నానీ నాకు మంచి స్నేహితుడు. నివేదా నటన నాకు నచ్చింది. ఆ సినిమా చూస్తున్న సేపు కన్నీళ్లు ఆగలేదు. క్లైమాక్స్‌లో నేను ఏడుస్తుంటే నా సోదరుడు కర్చీఫ్ ఇచ్చాడు. ఇక ఫిదా చూడటానికి వీలు కాలేదు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకొని లండన్ నుంచి వచ్చాను. ఫిదా చిత్రాన్ని త్వరలోనే చూస్తాను.


నంబర్ గేమ్ మీద నమ్మకం లేదు.

నంబర్ గేమ్ మీద నమ్మకం లేదు.

నాకు నంబర్ గేమ్ మీద నమ్మకం లేదు. నా కంటే ముందు నటించిన సీనియర్లను ఫాలో అవుతాను. రెండు సినిమాలు సక్సెస్ కాకపోతే ఈమె పనైపోయింది అని మీరే రాస్తారు. నాకు పోజిషన్ లేదు. సినిమాలు నటించడంపైనే దృష్టిపెడుతాను. మిగితా విషయాలను పట్టించుకొను.


సక్సెస్‌ మాత్రమే డిసైడ్ చేస్తుంది..

సక్సెస్‌ మాత్రమే డిసైడ్ చేస్తుంది..

నేను నటించిన సినిమాలు బాగా ఆడినప్పడు సంతోషం కలుగుతుంది. బాగా ఆడకపోతే బాధగా ఉంటుంది. రెండు సినిమాలు ఆడకపోతే రకుల్ డిమాండ్ లేదని, ఐరన్ లెగ్ అని మీరే రాస్తారు. కొత్తగా వచ్చిన హీరోయిన్లతో రకుల్‌కు అవకాశాలు తగ్గాయి అని మీరే చెప్పారు. సక్సెస్‌ మాత్రమే యాక్టర్లకు ఆనందం పంచుతుంది.
English summary
After sensational Hit of Rarandoi Veduka Chuddam, Tollywood actor Rakul Preet Singh's latest movie is Jaya Janaki Nayaka. She played lead role beside Hero Bellamkonda Srinivas. Sensational Director Boyapati Srinu is the director for the film. This movie slated to release on August 11th. In this occassion Rakul speaks with Filmibeat.com exclusively. Rakul shared her future projects in Tamil and Hindi. she said that she never felt insecure looking at Sai Pallavi and Niveda Thomas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu