twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బుల్లెట్స్‌తో దొరికిపోయిన తెలుగు హీరోయిన్, పోలీసు కస్టడీ

    By Bojja Kumar
    |

    న్యూఢిల్లీ: ఇటీవల సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన రాకుల్ ప్రీత్ సింగ్‌ను ఢిల్లీ ఎయిర్ పోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆమె బ్యాగులో రివాల్వర్‌లో వాడే బుల్లెట్ దొరకడమే ఇందుకు కారణం. పోలీసులు బ్యాగ్ చెక్ చేస్తుండగా ఆమె వద్ద ఉన్న ల్యాప్ టాప్ బ్యాగులో ఈ బుల్లెట్ దొరికింది.

    తనను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించిన విషయాన్ని రాకుల్ ప్రీత్ సింగ్ కూడా ధృవీకరించారు. ఓ ఆంగ్ల ప్రతికతో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్నివెల్లడించారు. 'తన వద్ద పోలీసులు తనిఖీల్లో 8 ఎంఎం బుల్లెట్ దొరికిన మాట వాస్తవమే అని, అవి ఇండియాలో దొరికే బుల్లెట్స్ కావు' అని ఆమె వెల్లడించారు.

    Rakul Preet Singh Lands In Police Custody For Carrying Bullet

    పోలీసులు తనను తనిఖీ చేస్తుండటంతో భయ పడిపోయిన రాకుల్ ప్రీత్ సింగ్ వెంటనే ఆర్మీ ఆఫీసర్ అయిన తన తండ్రికి ఫోన్ చేసింది. సదరు బుల్లెట్స్ ఆయనకు చెందినవో లేదో అని అడిగి తెలుసుకుంది. అయితే ఆ బుల్లెట్ తనకు సంబంధించినది కాదని చెప్పడంతో...ఆ తర్వాత బాగా ఆలోచించిన రాకుల్ ప్రీత్ సింగ్ ఆ బుల్లెట్ గతంలో తాను షూటింగులో వాడిందని గుర్తు చేసుకుని పోలీసులుకు ఈ విషయాన్ని చెప్పింది.

    ఓ తమిళ సినిమా షూటింగులో తాను రివాల్వర్ ఉపయోగించానని, అయితే అది టాయ్ బెల్లెట్ అని, నిజమైంది కాదని ఆమె చెప్పుకొచ్చింది. మొత్తానికి రాకుల్ ప్రీత్ సింగ్ తండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుని పోలీసులకు సర్ది చెప్పడంతో కథ సుఖాంతమైందట. చివరగా పోలీసులు ఆమెను ఆ బుల్లెట్ ఉపయోగించిన సినిమాకు సంబంధించి డీవీడీని పంపమని అడగటం కొసమెరుపు.

    English summary
    Actress Rakul Preet Singh, who was recently seen in Venkatadri Express, was recently held and interrogated by the CISF at Delhi's domestic airport for carrying a bullet. She was to board Mumbai-bound flight at Delhi airport on Saturday. During the security check, the police found this metallic object in her laptop bag.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X