»   » ఆ బాధ ఉంది, స్పైడర్ తో సాధిస్తాను: రకుల్ ప్రీత్ సింగ్

ఆ బాధ ఉంది, స్పైడర్ తో సాధిస్తాను: రకుల్ ప్రీత్ సింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొదట్లో రకుల్ ప్రీత్ సింగ్ కోలీవుడ్ లో అంతగా రాణించలేకపోయింది. పాపం ఎందుకోగానీ తమిళ ప్రేక్షకులు రకుల్ ని దగ్గరకు తీసుకోలేకపోయారు కానీ ఇప్పుడు మరో సినిమా ద్వారా కోలీవుడ్ లో క్రేజ్ పెంచుకునే ప్రయత్నం లో ఉంది ఈ బక్కపలుచ భామ. మహేష్ తో కలిసి స్పైడర్ తో ఇంకోసారి తమిళ ప్రేక్షకులని పలకరించనుంది రకుల్.

ధీరన్‌ అధికారం ఒండ్రు

ధీరన్‌ అధికారం ఒండ్రు

ఒకరకంగా ఏఆర్‌.మురుగదాస్‌ వంటి ప్రముఖ దర్శకుడి చిత్రంలో మహేశ్‌బాబు వంటి టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌కు జంటగా స్పైడర్‌ వంటి భారీ చిత్రంలో నటించే అవకాశం వరించడమే అనవచ్చు. ఈ చిత్రం ఈనెలాఖరున తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. కా గా ఇప్పటికే కోలీవుడ్‌లో కార్తీకి జంటగా ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రంలో నటిస్తున్న రకుల్‌ప్రీత్‌సింగ్‌కు సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో సూర్యతో రొమాన్స్‌ చేసే అవకాశం వరించింది.

సక్సెస్‌ కాలేదన్న బాధ

సక్సెస్‌ కాలేదన్న బాధ

అయితే స్పైడర్‌ చిత్రం విడుదల తరువాత మరిన్ని మంచి అవకాశాలు వస్తాయనే ఆశతో ఉన్న రకుల్‌ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ కోలీవుడ్‌లో సక్సెస్‌ కాలేదన్న బాధ కాస్త ఉన్నా, కచ్చితంగా ఇక్కడ విజయం సాధిస్తాననే నమ్మకం తనకు ఉందని పేర్కొంది.ఇప్పుడు తన నమ్మకం వమ్ము కాలేదని తమిళంలో మంచి అవకాశాలు వస్తున్నాయని అంది.

శివగామి తరహా పాత్రలో

శివగామి తరహా పాత్రలో

కోలీవుడ్‌లోనూ మంచి నటిగా పేరు తెచ్చుకుంటాననే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. చిత్రపరిశ్రమలో తన స్నేహితుల గురించి చెప్పాలంటే నటుడు రానా, నటి రెజీనా చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అని చెప్పింది. ఎలాంటి పాత్రలో నటిం చాలని ఆశ పడుతున్నారన్న ప్రశ్నకు ఎప్పటికైనా బాహుబలి చిత్రంలో శివగామి తరహా పాత్రలో నటించాలని కోరుకుంటున్నానని రకుల్‌ప్రీత్‌సింగ్‌ పేర్కొంది.

కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా

కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా

స్పైడర్ లో రకుల్ ప్రీత్ చేస్తున్న పాత్ర ఓ డాక్టర్. ఇప్పటివరకూ రకుల్ చేసిన సినిమాల్లో అతి పెద్ద బడ్జెట్ మూవీ ఇదే కావడం.. బిజినెస్ పరంగా కూడా అత్యధిక క్రేజ్ ఉండడం.. తెలుగు.. తమిళ్.. హిందీ భాషల్లో రిలీజ్ కానుండడంతో.. స్పై డర్ కోసం తన సర్వ శక్తులు ఒడ్డుతోంది రకుల్ ప్రీత్. ఈ మూవీ మొత్తం ఇలా కళ్లజోడు లుక్ లోనే కనిపిస్తుందట రకుల్. మహేష్ తో పాటలు మినహాయిస్తే అనే పాయింట్ అండర్ లైన్ చేసుకోవాలి.

English summary
Rakul Preet Singh, the much-sought-after Tollywood actress, is all set to make a comeback in K-Town with Mahesh Babu's Spyder Movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu