»   » రకుల్‌ ప్రీత్‌ కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ (వీడియో)

రకుల్‌ ప్రీత్‌ కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వరసగా స్టార్ హీరోల సినిమాలతో దూసుకుపోతున్న రకుల్‌ ప్రీత్‌ ఇప్పుడు స్వయంగా ఫైటింగులు చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఆమె బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటున్న ఓ వీడియోని ఫేస్‌బుక్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది.

This is How I love training!! Go mad !! Go crazy!! Sweat it out #toughtaskmaster

Posted by Rakul Preet on 5 November 2015

ఇలాంటి కఠినమైన శిక్షణ తీసుకోవడం అంటే తనకు ఎంతో ఇష్టమని.. చెబుతున్నారు. రకుల్‌ ఫేస్‌బుక్‌ ద్వారా పంచుకున్న ఈ వీడియోకి ఇంకో ఘనత కూడా వుండటం విశేషం. ఈ పోస్ట్‌ చేసిన కేవలం నాలుగు గంటల్లోనే దాదాపు ఒక లక్షా 30 వేల మంది వీక్షించటం మరో విశేషం.

రకుల్ కెరీర్ విషయానికి వస్తే..

రామ్ చరణ్ తో రీసెంట్ గా బ్రూస్ లీ చిత్రం చేసిన రకుల్ ప్రీతి సింగ్ ...ఇప్పుడు మరో మెగా హీరోతో జత కట్టడానికి సిద్దమవుతోంది. ఆమెను మెగా కుటుంబానికి చెందిన హీరో వరుణ్ తేజ కోసం ఎప్రోచ్ అయినట్లు సమాచారం.

కంచె విజయంతో వరుణ్ తేజ టాలీవుడ్ సర్కిల్స్ లో మంచి క్రేజ్ సాధించారు. ఇప్పుడీ హీరో మరో చిత్రం కమిటయ్యారు. రీసెంట్ గా పండుగ చేస్కో చిత్రం చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని తో ఆయన తదుపరి చిత్రం చేస్తున్నారు. అందులో హీరోయిన్ గా రకుల్ ప్రీతి సింగ్ ని అడిగినట్లు సమచారం. రకుల్ ప్రీతి సింగ్ ఇంతకు ముందు రామ్ సరసన పండుగ చేస్కో చిత్రం చేసింది. ఆ చిత్ర దర్శకుడు, ఈ కొత్త ప్రాజెక్టు డైరక్టర్ ఒకరే కావటంతో ఆమె డేట్స్ ఇవ్వటానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

Rakul1

అందుతున్న సమాచారం ప్రకారం కొద్ది రోజుల క్రితం దర్శకుడు గోపీచంద్ మలినేని ...వెళ్లి రకుల్ కు కథని నేరేట్ చేసినట్లు సమాచారం. ఆమె కూడా ఆ కథ విని చేయటానికి చాలా ఆసక్తి చూపిందని చెప్తున్నారు. ప్రస్తుతం చిత్రానికి సంభందించిన ఫైనల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో ఈ చిత్రం విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాసం ఉంది.

English summary
Rakul Preet Singh practising boxing for perfect figure.
Please Wait while comments are loading...